హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడెప్పుడంటే?
Hyderabad water cut: నగరవాసులకు హైదరాబాద్ జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలోని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్‌లో ఉన్న 1.36 ఎంఎల్ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ శుభ్రపరిచే పనుల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ మే 02 నుంచి 3వ తేదీ మధ్య నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలోని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్‌లో ఉన్న 1.36 ఎంఎల్ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ శుభ్రపరిచే పనులను చేపడుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 02.05.2026, శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.03.05.2026, అదివారం ఉదయం 6 గంటల వరకు అంటే మొత్తం 24 గంటల పాటు సరఫరాలో అంతరాయం కలగనుందని పేర్కొంది.
ప్రభావితమయ్యే ప్రాంతాలు ఇవే
ట్యాంక్ క్లీనింగ్ పనుల వల్ల కింద పేర్కొన్న డివిజన్లలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం లేదా తక్కువ ఒత్తిడితో నీరు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
- గోషామహల్, కార్వాన్ సర్కిల్ పరిధిలో రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
- ఇక గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్ నగర్‌లో నీటి సరఫరాకు అంతరాయం
- కవాడిగూడ సర్కిల్ పరిధిలో కవాడిగూడ వార్డ్, గాంధీనగర్ వార్డ్, దోమలగూడలో నీటి సరఫరాకు అతరాయం
- జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో బంజారాహిల్స్ వార్డ్ నీటి సరఫరాకు అతరాయం
జలమండలి విజ్ఞప్తి
పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ నిర్వహణ పనులు అత్యవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు పనుల దృష్ట్యా నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, సరఫరా పునరుద్ధరించే వరకు పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నామని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 6 గంటల తర్వాత సరఫరా యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
