Vijayawada: మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత.. కన్నులపండువగా ఉత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్ర కీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతన్నాయి. అమ్మవారికి చేస్తున్న వేడుకలు ఆరో రోజుకు చేరాయి. శనివారం మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిస్తోంది. లోక స్థితికారిణిగా..

Vijayawada: మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత.. కన్నులపండువగా ఉత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్ర కీలాద్రి
Goddess Mahalkshmi
Follow us

|

Updated on: Oct 01, 2022 | 7:45 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతన్నాయి. అమ్మవారికి చేస్తున్న వేడుకలు ఆరో రోజుకు చేరాయి. శనివారం మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిస్తోంది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శిస్తే ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. తెల్లవారు జాము 4 గంటల నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కాగా.. ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇప్పటివరకూ మూడు లక్షల మందికి పైగా భక్తులు దేవీ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వివిధ సేవలు, టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలపై రూ.31.40 లక్షలు ఆదాయం వచ్చింది. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీ. దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒకటైన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని నమ్మకం.

కాగా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇబ్బందులు కలగకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు, ప్రజలు, విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 25 నుంచి అక్టోబరు 5 వరకు వాహనాలు మళ్లిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్‌ – విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లించారు. చెన్నై – హైదరాబాద్‌ రాకపోకలు సాగించే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా దారి మళ్లించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..