Andhra Pradesh: కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.. రెండు కోట్లు రూపాయలతో దండలు..ఎక్కడంటే

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా తమ తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. నవ రాత్రుల్లో 6వ రోజున అమ్మవారు..

Andhra Pradesh: కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.. రెండు కోట్లు రూపాయలతో దండలు..ఎక్కడంటే
Currency Goddess
Follow us

|

Updated on: Oct 01, 2022 | 10:27 AM

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా తమ తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. నవ రాత్రుల్లో 6వ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.2 కోట్ల 16 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇలా ఏటా అమ్మవారిని లక్ష్మీ రూపంలో నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. మొదట రూ.11 లక్షలతో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు రూ.2 కోట్లకు చేరింది. భక్తులు అమ్మవారిని అలంకరించేందుకు తమ శక్తికొలది ధనాన్ని సమర్పిస్తారు. అనంతరం ఆ డబ్బును అమ్మవారి ప్రసాదంగా భావించి ఎవరు ఇచ్చిన ధనాన్ని వారు తిరిగి తీసుకు వెళ్తారు. కేవలం అమ్మవారినే కాకుండా ఆలయం ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో అలంకరిస్తారు. ఈ క్రమంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీ మాత రూపంలో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు అమ్మ అనుగ్రహం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మరోవైపు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిస్తోంది. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. తెల్లవారు జాము 4 గంటల నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..