Kaal Sarp Dosh: జాతకంలో కాల సర్ప దోషం ఉందా.. ప్రభావం, పరిహారాలు ఏమిటో తెలుసుకోండి..

|

Feb 07, 2024 | 4:25 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి వ్యక్తి జీవితంలో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులు జీవితమంతా చాలా కష్టపడవలసి ఉంటుంది. కాల సర్ప దోషం కూడా  ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తరచుగా అనారోగ్యం బారిన పడతారు. ఒక వ్యాధి నయమైతే కొంత  సమయం తర్వాత మరొక వ్యాధి ప్రారంభమవుతుంది.

Kaal Sarp Dosh: జాతకంలో కాల సర్ప దోషం ఉందా.. ప్రభావం, పరిహారాలు ఏమిటో తెలుసుకోండి..
Kaal Sarp Dosh
Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జాతకంలో గ్రహాలు నిర్దిష్ట స్థితిలో ఉన్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుంది. కాలసర్ప యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది. కాల సర్ప దోషం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వ్యక్తి జీవితం పోరాటాలతో నిండి ఉంటుంది.

కాలసర్ప దోషం అంటే ఏమిటి?

హిందూ మతంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి.. అన్ని గ్రహాలు రాహు.. కేతువుల మధ్య వచ్చే విధంగా ఉన్నప్పుడు ఒక యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జాతకంలో కాలసర్ప దోషం అంటారు.

కాలసర్ప దోషం లక్షణాలు, ప్రభావాలను తెలుసుకోండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి వ్యక్తి జీవితంలో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులు జీవితమంతా చాలా కష్టపడవలసి ఉంటుంది. కాల సర్ప దోషం కూడా  ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తరచుగా అనారోగ్యం బారిన పడతారు. ఒక వ్యాధి నయమైతే కొంత  సమయం తర్వాత మరొక వ్యాధి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

కాల సర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మకం. జీవితంలో మళ్లీ మళ్లీ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వ్యక్తుల వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి వారి వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. అంతేకాదు పిల్లల వైపు నుండి కూడా అనేక రకాల సమస్యలు వారి జీవితంలోకి వస్తాయని విశ్వాసం.

కాలసర్ప దోషానికి నివారణలు

కాలసర్ప దోష ప్రభావాన్ని తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు సూచించబడ్డాయి. ఈ నివారణలను సరిగ్గా అనుసరించడం ద్వారా కాలసర్ప దోష ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయని నమ్ముతారు. కాల సర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి తన ఇంటిలో మాత్రమే కాదు అతని దగ్గర నెమలి ఈకలను ఉంచుకోవాలి.  ప్రవహించే నదిలో వెండితో చేసిన పాములను విడిచి పెట్టాలి.

కాల సర్ప దోష నివారణకు శివుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరం. కనుక శివుడిని పూజించి, ప్రతిరోజూ ఇంట్లో లేదా ఆలయానికి వెళ్లి శివలింగానికి పాలు సమర్పించి అభిషేకం చేయాలి. కాల సర్ప దోష ప్రభావాలను తగ్గించడానికి, మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వలన అత్యంత ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం.

పురాణాల ప్రకారం శివుని అవతారమైన హనుమంతుడిని పూజించడం వల్ల కాలసర్ప దోష ప్రభావం కూడా తగ్గుతుంది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ 11 సార్లు చదవాలి. కాల సర్ప దోషం విషయంలో ఇంటి ఇలవేల్పుని క్రమం తప్పకుండా పూజించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు