Indira Ekadashi 2024: గ్రహ దోష నివారణకు ఇందిరా ఏకాదశి వ్రతం శుభ ఫలితాలు ఇస్తుంది.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే

ఇందిరా ఏకాదశి ఉపవాసం ప్రతి సంవత్సరం భాద్రపద పక్ష మాసంలో (లేదా ఆశ్వయుజ, ఆశ్వీజ మాసంలోని కృష్ణ పక్షం) ఏకాదశి నాడు ఆచరిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు, ఉపవాసాలు విధివిధానాల ప్రకారం చేస్తారు. ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

Indira Ekadashi 2024: గ్రహ దోష నివారణకు ఇందిరా ఏకాదశి వ్రతం శుభ ఫలితాలు ఇస్తుంది.. పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే
Indira Ekadashi 2024
Follow us

|

Updated on: Sep 24, 2024 | 3:40 PM

హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన రోజులలో ఇందిరా ఏకాదశి ఒకటి. భాద్రపద పక్ష మాసంలో ఏకాదశి ఉపవాసం గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనిని ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం చేయడం వలన పుణ్యం లభిస్తుందని.. విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇందిరా ఏకాదశి ఉపవాసం ప్రతి సంవత్సరం భాద్రపద పక్ష మాసంలో (లేదా ఆశ్వయుజ, ఆశ్వీజ మాసంలోని కృష్ణ పక్షం) ఏకాదశి నాడు ఆచరిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు, ఉపవాసాలు విధివిధానాల ప్రకారం చేస్తారు. ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

ఇందిరా ఏకాదశి తేదీ, సమయం

భాద్రపద పక్ష మాసంలో ఇందిరా ఏకాదశి తిథి, ముహూర్త ద్రుక్ పంచాంగ ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 శుక్రవారం మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 02:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఆదివారం 29న ఉపవాస దీక్ష ముగియనున్నది.

ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజున ఉదయం 05:23 నుంచి మధ్యాహ్నం 02:52 వరకు పూజకు అనుకూలమైన సమయం. ఈ పూజలో బ్రహ్మ ముహూర్తం, విజయ ముహూర్తం ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇందిరా ఏకాదశి పూజా విధానం

  1. ఇందిరా ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  2. శుభ్రమైన ప్రదేశంలో పీఠంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించండి.
  3. విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపం వెలిగించి.. ఉపవాస వ్రతం దీక్ష చేపట్టండి.
  4. దేవుడికి పసుపు పూలు సమర్పించండి. పసుపు విష్ణువుకు ప్రీతికరమైనది.
  5. ధూపం, దీపాలు వెలిగించి పరిసరాలను శుద్ధి చేయండి.
  6. దేవుడికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించండి.
  7. ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పఠించి, విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి.
  8. పూజానంతరం ప్రసాదం మీరు తిని ఇతరులకు ప్రసాదాన్ని పంచండి. పేదలకు దానం ఇవ్వండి.

ఇందిరా ఏకాదశి రోజున మంత్రాన్ని పఠించండి:

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన| యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || ఓం శ్రీ విష్ణవే నమః । క్షమాయాచన సమర్పణ యామి ॥

ఇందిరా ఏకాదశి విశిష్టత:

ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాదు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత, మోక్షం లభిస్తాయని విశ్వాసం. ఏకాదశి ఉపవాసం పాటించే ముందు మత గురువు లేదా పూజారి సలహా తీసుకోవడం మంచిది. ఏకాదశి తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది.

ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషం ఉంటే ఇందిరా ఏకాదశి రోజున విష్ణువు ముందు కూర్చుని 21 సార్లు నవ గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఇది గ్రహాలను శాంతింపజేస్తుంది. అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా నవగ్రహాలకు ధాన్యాలు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇంట్లో ధన, ధాన్యాలకు ఎప్పుడూ లోటు ఉండదు.

ఇందిరా ఏకాదశి వ్రతం కథ:

పురాణాల ప్రకారం ఇంద్రసేనుడు అనే గొప్ప దయగల, శక్తివంతమైన రాజు ఉన్నాడు. అతను తన ప్రజల గురించి చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అందువలన అతను నిజాయితీగల రాజుగా, విష్ణువు గొప్ప భక్తుడిగా చాలా గుర్తింపు పొందాడు. ఒకసారి నారద మహర్షి ఇంద్రసేనుని రాజ్యాన్ని సందర్శించి.. అతని తండ్రి మరణించిన తర్వాత ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో తెలియజేశాడు.

నారద మహర్షి ఇంద్రసేనతో తన తండ్రి యమలోకంలో నివసిస్తున్నాడని.. అక్కడ అతను తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతున్నాడని చెప్పాడు. ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి తన తండ్రిని అన్ని పాపాల నుంచి విముక్తి చేసి మోక్షాన్ని అందిచమని నారద మహర్షి సందేశాన్ని అందించాడు.

ఉపవాసం , ఆచారాలను, దానిని ఎలా పాటించాలో వివరించడానికి నారద మహర్షి రాజుకు సహాయం చేశాడు. ఇంద్రసేన రాజు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు దానిని ముగించాడు, నారద ముని చెప్పినట్లుగా.. ఆ సమయంలో ఆ మహారాజు తన తండ్రి విష్ణు నివాసం వైపుకు వెళ్లడం .. అతనిపై పువ్వులు పడటం చూశాడు. రాజు తండ్రి మోక్షాన్ని పొందడమే కాకుండా, ఇంద్రసేన రాజు తన పాలనా కాలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాడు. ఇందిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే ఫలితాలను తెలిసినప్పటి నుండి ప్రజలు, భక్తులు భక్తీ శ్రద్దలతో ఇందిరా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు.

2024 ఇందిరా ఏకాదశి:

పరణ అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పరణ చేస్తారు. సూర్యోదయానికి ముందే ద్వాదశి ముగియకపోతే ద్వాదశి తిథిలోనే పారణ చేయాలి. ద్వాదశిలోపు పారణం చేయకుంటే పాపంతో సమానం.

హరి వాసర సమయంలో పారణ చేయరాదు. ఉపవాసం విరమించే ముందు హరి వాస ముగిసే వరకు వేచి ఉండాలి. హరి వాసర ద్వాదశి తిథిలో మొదటి నాల్గవ కాలం. ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఉదయం శుభ సమయం. మధ్యాహ్నం ఉపవాసం విరమణ వద్దు. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఉదయం ఉపవాసం విరమించడం సాధ్యం కాకపోతే మధ్యాహ్న సమయంలో చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి