Dream: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీ దశ తిరుగుతున్నట్లే, మీకు ఎదురే ఉండదు.
నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో కలలు కంటారు. అయితే కలలో కనిపించే వస్తువులు, సంఘటనలు మన దైనందిక జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. నిద్రలో కనిపించే సంఘటనలు..
నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో కలలు కంటారు. అయితే కలలో కనిపించే వస్తువులు, సంఘటనలు మన దైనందిక జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. నిద్రలో కనిపించే సంఘటనలు, దృశ్యాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే వాటికి సాక్ష్యాలుగా నిలుస్తాయని చెబుతుంటారు. వీటిలో కొన్ని ఆందోళనలు కలిగించేవి ఉంటే మరికొన్ని మాత్రం మంచిని చేకూర్చేవి ఉంటాయి. అలా మంచికి ప్రతిరూపకంగా నిలిచే కొన్ని కలలపై ఓ లుక్కేయండి..
* రాత్రి పడుకున్న సమయంలో కలలో డబ్బులు కనిపిస్తే మీకు ధన లాభం కలుగుతుందని అర్థం. మిమ్మల్ని ఎన్ని రకాల కష్టాలు వెంటాడుతున్నా జీవితంలో విజయం, ఆనందం వస్తుందని చెబుతున్నారు. కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
* కలలో ధాన్యం కనిపించడం అదృష్టానికి సూచికగా చెప్పొచ్చు. ధాన్యం భూమి అందించే వరంలాంటిదని చెబుతుంటారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. రానున్న రోజుల్లో ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి.
* సహజంగానే బంగారాన్ని ఐశ్వర్యానికి సూచికగా చెబుతుంటారు. అలాంటి బంగారం కలలో కనిపిస్తే ఎలాంటి మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలలో బంగారం కనిపిస్తే మీ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని అర్థం. పనిలో గౌరవనీయమైన స్థానాన్ని చేరుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని అర్థం.
* ఇక కలలో గంభీరంగా ఉండే డేగలు కనిస్తే ధైర్యానికి ప్రతీకని అర్థం. భయానకంగా ఉన్నా డేగలు కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని చెబుతారు. కష్టాలు ఎదరైనా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అంతేకాకుండా వండిన మాంసాన్ని తింటున్నట్లు కలలో వచ్చినా సంపద పెరుగుతుందని అర్థం.
* వ్యవసాయ జంతువులైన ఆవు, గేదెల పేడ పట్టుకుంటున్నట్లు కలలో వస్తే అది అదృష్టానికి సంకేతంగా చెప్పొచ్చు. పేడపై అడుగు పెట్టినట్లు కల వస్తే ఊహించని అదృష్టాన్ని చేజిక్కించుకుంటున్నారని అర్థం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..