AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra: జగన్నాథుని అత్త ఎవరు? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తాడు? అత్త ఇచ్చే విందుని ఏమంటారో తెలుసా..

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం రెండవ రోజున జగన్నాథుడు తన అత్త ఇంటికి ఆతిధ్యం కోసం అన్న, చెల్లెలుతో కలిసి వెళ్తాడు. అయితే జగన్నాథ ప్రభువు అత్త ఎవరు? జగన్నాథ ఆలయానికి.. ఆమె ఇల్లు ఎంత దూరంలో ఉం? జగన్నాథుడు అత్త ఇంటికి చేరుకోగానే ఎలా స్వాగతం పలుకుతారు? ఈ ప్రశ్నలు కలిగితే.. ఈ రోజు జగన్నాథుడు అత్త గురించి ఆమె ఇంటికి ఎందుకు వెళ్తాడు అనే విషయం తెలుసుకుందాం..

Jagannath Rath Yatra: జగన్నాథుని అత్త ఎవరు? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తాడు? అత్త ఇచ్చే విందుని ఏమంటారో తెలుసా..
Gundicha Temple
Surya Kala
|

Updated on: Jun 26, 2025 | 4:20 PM

Share

జగన్నాథ ఆలయ రథయాత్ర అనేది భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు పూరీకి చేరుకునే పండుగ. ఒరిస్సాలోని పూరీ నగరంలో లక్షలాది మంది పాల్గొనే ఉత్సవం జగన్నాథ రథోత్సవం. జగన్నాథుడు ఆషాఢ మాసం రెండవ రోజున తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి రథం ఎక్కి తన అత్త గుండిచా ఆలయానికి వెళతాడు. దీనిని జగన్నాథ అత్త ఇల్లు అని పిలుస్తారు. తన అత్త ఇంటికి వెళ్ళిన తర్వాత.. జగన్నాథుడు అక్కడ అన్నా చెల్లెలతో కలిసి 7 రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ తన జగన్నాథ పూరీకి తిరిగి వస్తాడు.

జగన్నాథుని ఈ లీల చాలా మర్మమైనది. ఈ ప్రయాణానికి ముందు జగన్నాథుని ఆలయ తలుపులు 15 రోజులు మూసివేయబడతాయి. ఎందుకంటే జగన్నాథుడు 15 రోజులు జ్వరంతో బాధపడతాడు. జగన్నాథుడు జ్వరం నుంచి కోలుకున్న వెంటనే.. అతను తన అత్త ఇంటికి యాత్రకు వెళ్తాడు.

జగన్నాథుని అత్త గుండిచా ఎవరు?

ఇంద్రద్యుమ్నుడి భార్య, సద్గుణవంతురాలైన రాణి గుండిచా వెలసిన ఆలయం గుండిచా ఆలయం. ఈ మందిరం జగన్నాథ ఆలయం నుంచి 3 కి.మీ దూరంలో ఉంది. దీని నిర్మాణ శైలిని పరిశీలిస్తే..ఇది కళింగ కాలం నాటిదిగా కనిపిస్తుంది. కృష్ణుడు అత్త గుండిచ, ఈ ప్రయాణం గురించి చాలా కథలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గుండిచకు సంబంధించిన పురాణ కథ

ఆ ప్రసిద్ధ కథలలో ఒకటి ఏమిటంటే.. ఒకసారి జగన్నాథుడు ఇంద్రద్యుమ్నుడు కలలో కనిపించి.. సముద్ర తీరంలో ఒక చెక్క ముక్క కనిపిస్తుంది.. దానితో నా విగ్రహాన్ని నిర్మించమని చెప్పాడు. కలలో కనిపించిన విధంగానే రాజు ఒక చెక్క దుంగను కనుగొని జగన్నాథుడిని విగ్రహం చెక్కించాలని భావించాడు. అయితే ఆ విగ్రహాన్ని నిర్మించడానికి శిల్పి లేడు.. అప్పుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ అనే వృద్ధుడు రూపంలో రాజు దగ్గరకు వచ్చాడు. అతను తనను తాను పరిచయం చేసుకోలేదు. అయితే తాను చెక్కతో జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాడు. అయితే షరతు ఏమిటంటే 21 రోజులు ఎవరూ ఆ భవనంలోకి ప్రవేశించకూడదు.. అప్పుడే నేను ఈ విగ్రహాలను తయారు చేస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజు.. కొన్ని రోజుల తర్వాత ఉత్సుకతతో విగ్రహం చెక్కుతున్న తలుపు తెరిచాడు. అప్పుడు విగ్రహాలకు చేతులు ,కాళ్ళు లేని అసంపూర్ణ విగ్రహాలు కనిపించాయి.శిల్పి లేడు. అప్పుడు జగన్నాథుడు రాజు కలలో కనిపించి తనని ఇలా ప్రతిష్టించమని చెప్పాడు.

ఇప్పుడు జగన్నాథుని ప్రాణ ప్రతిష్ఠకు ఎవరిని పిలవాలనే దానిపై చర్చ జరిగింది. నారదుడు అక్కడికి చేరుకుని.. ఒక ప్రత్యేక వ్యక్తి మాత్రమే జగన్నాథుడిని స్థాపించగలడని అతనే బ్రహ్మ దేవుడు.. ఆ బ్రహ్మ మాత్రమే జగన్నాథుని విగ్రహాన్ని స్థాపించగలడని చెప్పాడు. బ్రహ్మదేవుడి అనుమతి తీసుకోవడానికి ఇంద్రద్యుమ్నుడు నారదదేవుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత రాణి గుండిచ తన భర్త ఇక్కడ లేనప్పుడు తాను ధ్యానం చేసుకోవాలని భావించింది. అలా గుండిచ ఆలయంలోని ఒక గుహలో ధ్యానంలో మునిగిపోయినట్లు చెబుతారు. అయితే జగన్నాథుని దగ్గర తనను కలవడానికి ఖచ్చితంగా రావాలని జగన్నాథుడి నుండి వాగ్దానం తీసుకుంది. అప్పుటి నుంచి జగన్నాథుడు గుడించా ఆలయానికి వచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. జగన్నాథుడు ప్రతి సంవత్సరం గుండిచను కలవడానికి వెళ్తాడు.

గుండిచా మార్జన అంటే ఏమిటి?

ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలరాముడు, సుభద్రను స్వాగతించడానికి గుండిచా ఆలయానికి రాకముందు రోజు.., ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం. దీనినే గుండిచా మార్జన అని కూడా అంటారు. అంటే గుండిచా ఆలయాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా ఏడు రోజులు అక్కడే ఉంటారు. రథయాత్ర ఉత్సవం ప్రారంభమయ్యే ఒక రోజు ముందు గుండిచా మార్జన జరుగుతుంది.

గుండిచా మాత దేవుడిని ఏ వంటకాలతో స్వాగతిస్తుంది?

తన ప్రతిజ్ఞ ప్రకారం జగన్నాథుడు తన ప్రధాన నివాసం నుంచి ఏడు రోజులు గుండిచ ఆలయంలో నివసించడానికి బయలుదేరిన ఆనందకరమైన యాత్రే జగన్నాథ రథయాత్ర. మరో ప్రముఖ పురాణం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని ప్రియమైన అత్త గుండిచ నివాసంగా అభివర్ణిస్తుంది. ఈ హృదయాన్ని కదిలించే కథనంలో అత్త గుండిచ తన మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్రల రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ముద్దుల మేనల్లుడి కోసం అత్త ఒక ప్రత్యేక విందును సిద్ధం చేస్తుంది. అదే సాంప్రదాయంగా బియ్యంతో చేసే రుచికరమైన ‘పడోపీఠం’. తో పాటు రసగుల్లా ఈ విందులో ఉంటాయి. ప్రతి సంవత్సరం జగన్నాథ ప్రభువు వచ్చినప్పుడు ఈ ఆలయంలో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. జగన్నాథుడిని స్వాగతిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..