AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Retrograde: జూలై 13 నుంచి తిరోగమనంలో శనీశ్వరుడు.. ఈ రాశుల వారు బంగారం పట్టుకున్నా మన్నే.. జాగ్రత్త సుమా..

2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో శనీశ్వరుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. మీన రాశిలో శని గ్రహం తిరోగమనంలో కదులుతుంది. ఈ సమయంలో అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం చూపించినా.. కొన్ని రాశుల వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావింతం చేస్తుంది ఈ గమనం. ఈ సమయంలో శనీశ్వరుడు తిరోగమనం ప్రభావంతో ఏ రాశులు కష్టాల బారిన పడతాయో తెలుసుకుందాం.

Saturn Retrograde: జూలై 13 నుంచి తిరోగమనంలో శనీశ్వరుడు.. ఈ రాశుల వారు బంగారం పట్టుకున్నా మన్నే.. జాగ్రత్త సుమా..
Lord Shani Puja
Surya Kala
|

Updated on: Jun 26, 2025 | 3:43 PM

Share

సూర్యుడు ఛాయాదేవిల తనయుడు.. నవ గ్రహాలలోని ఒకడైన శనీశ్వరుడు జ్యేష్ఠ మాసంలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. మందగమనుడైన శనీశ్వరుడు జూలై 13వ తేదీన తిరోగమనంలోకి వెళ్తాడు. జ్యోతిష్యం ప్రకారం న్యాయ దేవుడు.. కర్మ ఫలదాత తిరోగమనంలోకి వెళ్ళినప్పుడు అంటే శనిశ్వర సంచారంతో అనేక రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు శుభాలను కలుగ జేయగా.. మరికొన్ని రాశులకు సమస్యలను సృష్టిస్తుంది.

శనిశ్వర తిరోగమనం జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉంటుంది. అంటే శనిశ్వరుడు 138 రోజుల పాటు తిరోగమన స్థితిలో ఉంటాడు. శనీశ్వరుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శనీశ్వరుడు తిరోగమనం అనేక రాశులకు సమస్యలను సృష్టించగలదు.

శనీశ్వరుడు శివయ్యల మధ్య సంబంధం

హిందూ మతంలోని పురాణ గ్రంథాల ప్రకారం శనీశ్వరుడు శివుడిని తన గురువుగా భావించాడు. శివయ్య అనుగ్రహం కోసం ఘోర తపస్సు కూడా చేశాడు. అంతేకాదు శనీశ్వరుడికి, భోలాశంకరుల మధ్య గురువు, శిష్యుల సంబంధం ఉంది. శనీశ్వరుడు క్రూరమైన గ్రహంగా భావిస్తారు. అయితే శివుడు స్వయంగా శనీశ్వరుడుకి కర్మానుసారం న్యాయం చేసే హక్కును ఇచ్చాడు. త్వరలో శనీశ్వరుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సమయంలో అనేక రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మేష రాశి

మేష రాశి వారు ప్రస్తుతం శనీశ్వరుడు ప్రభావంతో ఏలి నాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో శని తిరోగమనం మేష రాశి వారికి ఇబ్బంది కలిగించవచ్చు. మేష రాశి వారు 138 రోజులు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మిథున రాశి

శనీశ్వరుడు చెడు దృష్టి మిథున రాశి వారిపై పడవచ్చు. ఈ రాశి వారు శనీశ్వరుడు తిరోగమనంతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోంవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్ధిక ఇబ్బందుల్లో పడవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవచ్చు.

కన్య రాశి:

కన్య రాశి వారికి శనీశ్వరుడు తిరోగమనం సమయం మొత్తం 138 వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల మనస్సు చంచలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తలెత్తవచ్చు. ముఖ్యంగా వాదనలకు, చర్చలకు దూరంగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను అదుపులో ఉంచుకోండి.

వృశ్చిక రాశి:

శనీశ్వరుడు తిరోగమనం వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు కష్టపడాల్సి రావచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. వీరు డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవాలి. డబ్బు వీరి చేతుల నుంచి ఇసుకలాగా జారిపోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు