- Telugu News Photo Gallery Spiritual photos July 2025 Horoscope: These are lucky zodiac signs and financial gains details in Telugu
July Horoscope: కీలక గ్రహాల అనుకూలత.. జూలైలో మహా భాగ్యవంతులు ఈ రాశుల వారే!
జూలైలో నెల మొదటి వారంలో బుధ, చంద్రుల మధ్య మూడు రోజుల పాటు రాశి పరివర్తన, నెల మధ్యలో రవి కర్కాటక రాశిలోకి ప్రవేశం, నెలాఖరులో కుజుడు కన్యారాశి, శుక్రుడు మిథున రాశి ప్రవేశం జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి జీవితాల్లో ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలవంతం అవుతాయి. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
Updated on: Jun 26, 2025 | 4:52 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు క్రమంగా బలపడుతుండడంతో పాటు రవి అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. గృహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు, రవి, బుధులతో పాటు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెదిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

మిథునం: ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలు పట్టబోతున్నాయి. రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గి, సఖ్యత, సాన్నిహిత్యం, సామరస్యం పెరుగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగు తుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపుతో పాటు పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో, శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదాతో పాటు, జీతభత్యాలు కూడా అంచనా లను మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం: గ్రహాల మార్పువల్ల ఈ రాశికి భాగ్య, దశమ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల ఉద్యోగపరంగా శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అందలాలు ఎక్కే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే సూచనలున్నాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

మకరం: ఈ రాశికి రవి, శుక్ర, బుధ, కుజులు అనుకూలంగా మారుతున్నందు వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలమవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.



