AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Dasara: గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..

హిందువులు గంగానదిని దేవతగా భావించి పూజిస్తారు. దివి నుంచి భువికి గంగమ్మ దిగిన రోజుని గంగావతరణ పండగగా జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్కరూ గంగా స్నానం చేయలేరు కనుక.. ఇంట్లోనే గంగా స్నానం ఫలం దక్కాలంటే చిన్న పరిష్కారం ఉంది. అది ఏమిటంటే..

Ganga Dasara: గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
Ganga Dussehra
Surya Kala
|

Updated on: Jun 03, 2025 | 4:41 PM

Share

గంగా దసరా పండగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షం దశమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం గంగా దసరా జూన్ 5వ తేదీ గురువారం రోజున జరుపుకోవడానికి హిందువులు రెడీ అవుతున్నారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వలన మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. అయితే ఏ కారణం చేతనైనా గంగా స్నానం చేయడం వీలు కాకపోతే.. ఇంట్లోనే మానసి స్నానం చేయవచ్చు.

మానసి స్నానం అంటే ఏమిటి?

మానసి స్నానం లేదా దీనిని మనసిక స్నానం అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. దీని ద్వారా వ్యక్తి తన మనస్సు , ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. ధ్యానం, ప్రార్థన ద్వారా ఈ స్నాన ఫలాన్ని పొందవచ్చు. ఇలా చేయడం వలన గంగానదిలోస్నానం చేసినంత పుణ్యం పొందుతారని నమ్మకం.

కుంభమేళాలో కూడా శారీరకంగా వైకల్యం ఉన్నవారికి, మానసి స్నానం గురించి సాధువులు, ఋషుల వివరించారు. కనుక గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చేయలేని వృద్ధులు, రోగులు లేదా శారీరకంగా వైకల్యం ఉన్నవారికి మానసిక స్నానం ఒక పరిష్కారం కావచ్చు. అంతేకాదు గంగాలో స్నానం చేయలేని భక్తులకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. పురాణ గ్రంథాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం, దేవుడిని స్మరించడం, స్వచ్ఛమైన మనస్సుతో మానసిక కోరిక అనే ఊహే ఈ స్నానం పూర్తి ఫలాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మానసి స్నానం ఎలా చేయాలంటే

మానసి స్నానం చేసే వారు ముందు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. స్నానం చేసే నీటిలో గంగాజలం కలపాలి. ఈ నీటితో మొదట సూర్యుడికి అర్ఘ్యం అర్పించండి. దానితో పాటు గంగా నదిలో స్నానం చేయడానికి రావడం వీలు కాలేదంటూ గంగమ్మకు క్షమాపణ చెప్పి.. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ.. నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురుమ్ అనే శ్లోకాన్ని.. పటించి స్నానం చేయండి. ఇలా చేయడం వలన పరమపవిత్రమైన గంగ, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరి మొదలైన పుణ్య నదుల నీరు శిరస్సు మీది కురులపై చల్లుకుంటున్నాను అని అర్ధం. ఇంట్లోనే ఉండి స్నానం చేయడం వలన అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం వస్తుందని నమ్మకం.

ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. పూజ చేయండి. దానధర్మాలు చేయండి. పేదవారికి సహాయం చేయండి. సూర్యుడికి రాగి పాత్రలో నీరు, అక్షతలు వేసి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్నా గంగా దసరా రోజున స్నానం చేసిన పుణ్యాన్ని పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు