Vastu Tips: చిన్న విషయాలకే తరచూ కోపం వస్తుందా.? మీ ఇంట్లో ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి

ఇదిలా ఉంటే వాస్తు కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? అవును వాస్తు నియమాలు పాటించకపోతే, లేదా ఏదైనా వాస్తులో తప్పులు ఉంటే ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వాస్తులో లోపాలు ఉంటే కోపాన్ని నియంత్రించుకోలేరని, చిన్న చిన్న కారణాలకే....

Vastu Tips: చిన్న విషయాలకే తరచూ కోపం వస్తుందా.? మీ ఇంట్లో ఈ వాస్తు లోపాలున్నాయేమో చూసుకోండి
Vastu Tips For Anger
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2023 | 2:37 PM

మనుషుల శారీరక ఆరోగ్యంపై వాస్తు ప్రభావం ఉంటుందని విశ్వసించే వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతుంటారు. వాస్తు పండితులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇంటి వాస్తులో లోపాలు ఉంటే వ్యక్తులు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారని చెబుతుంటారు. అందుకే వాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచిస్తుంటారు.

ఇదిలా ఉంటే వాస్తు కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? అవును వాస్తు నియమాలు పాటించకపోతే, లేదా ఏదైనా వాస్తులో తప్పులు ఉంటే ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వాస్తులో లోపాలు ఉంటే కోపాన్ని నియంత్రించుకోలేరని, చిన్న చిన్న కారణాలకే విపరీతమైన కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. యఅఇతే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే చిన్న చిన్న లోపాల కారణంగానే ఇలా జరగుతుందని చెబుతున్నారు. ఇంతకీ తరచూ కోపం వచ్చే వారు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

వాస్తు పండితుల అభిప్రాయం మేరకు ఇంట్లో ఎక్కువగా మురికిగా ఉంటే నిత్యం కోపం వస్తుందని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉదయం నిద్రలేవగానే ఎవరికి వారు వారి అర చేతులను చూసుకొవాలని చెబుతున్నారు. అనంతరం మనసులో ఇష్ట దైవాన్ని ప్రారంభించాలని చెబుతున్నారు. ఇక మానసిక ఆందోళన తగ్గాలన్నా, కోపం దరిచేరకుండా ఉండాలన్ని ఆగ్నేయ దిశలో ఎట్టి పరిస్థితుల్లో తలపెట్టి పడుకోకూడదని చెబుతున్నారు. ఈ దిశలో తల పెట్టుకొని పడుకుంటే కోపం పెరుగుతుందని చెబుతున్నారు.

ఇక నిత్యం కోపం వస్తుంటే ఇంట్లో ఏదో నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటికి తూర్పు దిశలో దీపం వెలిగించడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో గోడలకు వేసే రంగులు కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ముదురు రంగులు వేసుకోకూడదని చెబుతున్నారు. ఇలాంటి రంగులు ఉంటే నిత్యం చిరాకు, కోపం వస్తుంటాయి. వీలైనంత వరకు లేత రంగులు ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా బెడ్ రూమ్‌లో లైట్‌ కలర్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం చిరాకు, కోపంగా ప్రవర్తిస్తుంటే.. ఓ చిన్న గిన్నెలో రాతి ఉప్పును నీటిలో వేసి గదిలోని ఓ మూలన ఉంచాలని సూచిస్తున్నారు. ఆ నీటితో ఇళ్లు తూడవడం వల్ల చిరాకు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలు వాస్తు శాస్త్రాల్లో తెలిపిన వివరాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్