AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: దీపావళి రోజు దీపాలు వెలిగించే సరైన విధానం ఏంటో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

దీపావళి పండుగ అంటే దీపావల వరుస.. ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్న పాఠం.. అవును,.. దీపావళి అంటే ప్రతి ఇంట్లో వెలుగుల పండుగ. ఈ రోజు దీపాలు వెలిగించడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఒక పవిత్రమైన ఆచారం కూడా. అయితే, దిపావళి రోజున దీపాలు వెలిగించేందుకు ఓ పద్ధతి ఉంటుందని మీకు తెలుసా? అదేంటో తప్పక తెలుసుకోండి..

Diwali 2025: దీపావళి రోజు దీపాలు వెలిగించే సరైన విధానం ఏంటో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
Diwali 2025
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2025 | 9:23 PM

Share

దీపావళి రోజున ప్రతి ఇంట్లోనూ దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తారు. అయితే, దివాలీ రోజున దీపాలు వెలిగించేందుకు ఓ పద్ధతి ఉంటుందని మీకు తెలుసా? దీపావళి రోజున లక్ష్మీ గణేశ పూజలో దీపాలను నేరుగా నేలపై ఉంచకూడదు. ఏదైనా ఆసనం లేదంటే ఆకు లేదంటే అక్షతలు ఉంచి దీపం వెలిగించాలి. అలాగే, దీపాన్ని ఓ పవిత్ర రూపంగా భావించి పూజిస్తారు. అలాంటి దీపంలో నూనెను నిండుగా వేయడం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అది పొంగి నూనె బయటికివచ్చే అవకాశం ఉంటుంది.. ఇది దైవశక్తికి అవమానంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు.

దీపాల నుండి నూనె వృథాగా కిందపడిపోవడం అంటే ధనం వృథా కావడం వంటిది. ఇది లక్ష్మీదేవికి అప్రీతికి సంకేతం. దీపంలో నూనె పొంగడం వల్ల ఆర్థిక నష్టాలు, ఇంటి ఆర్ధిక స్థితిలో ఒడుదుడుకులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే, దీపావళి రోజున ఆరోగ్యానికి చిహ్నంగా తూర్పు దిశలో, ధనానికి ఉత్తర దిశలో దీపం వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు. నేతి దీపంలో పత్తి వత్తిని ఉంచి వెలిగించాలని చెబుతున్నారు. నూనె దీపంలో ఎర్ర దారం వత్తిని ఉపయోగించాలని సూచించారు. అంతేకాదు.. దీపావళి రోజున పగిలిన , పాత దీపాలను వెలిగించకూడదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం (చీకటి పక్షం) త్రయోదశి రోజున, మరణానికి అధిపతి యమ ధర్మ రాజు పేరుతో యమ దీపం వెలిగిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి తిథి 2025లో అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..