Viral News: సైకిల్ కొంటాం..లోన్ కావాలంటూ బ్యాంకు వెళ్లిన చిన్నారులు..! తాకట్టు పెడతామంటూ..
ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. బ్యాంకులో డబ్బులు ఇస్తారని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలని అడిగారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇద్దరు చిన్నారులు బ్యాంకుకు వెళ్లి సైకిల్ కోసం లోన్ ఇస్తారా అంటూ ఏకంగా బ్యాంకు మేనేజర్‌ని కలిశారు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాన్ష్, రహస్య తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలని అడిగారు.
సైకిల్ కొనుక్కుంటాం.. మాకు లోన్ ఇవ్వండి. తాకట్టుగా తమ వద్ద ఉన్న బంగారం పెడుతామని చిన్నారులు బ్యాంకు మేనేజర్‌ను కోరారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మండల పరిధిలోని బర్దీపూర్‌కు చెందిన దేవాన్ష్, రహస్య తల్లి సునీతతో కలిసి దసరా సెలవులలో అదే గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. వారి తల్లి.. బ్యాంకులో మహిళా సంఘం డబ్బులు తీసుకునేందుకు వచ్చారు.
బ్యాంకులో డబ్బులు ఇస్తారన్న విషయం తెలుసుకున్న చిన్నారులు.. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి.. ఆడుకునేందుకు సైకిల్ కొనుక్కుంటాం.. డబ్బులు ఇవ్వండని అడిగారు. ఆశ్చర్యానికి గురైన మేనేజర్.. తాకట్టుగా ఏం పెడతారని ప్రశ్నించగా.. తమ దగ్గర భూమి ఉంది.. బంగారం కూడా ఉందని సమాధానం ఇచ్చారు. మేనేజర్ నవ్వుతూ చిన్నారులను తిరిగి ఇంటికి పంపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




