AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: ఈ పాములు సొమరితనానికి బ్రాండ్అంబాసిడర్.. కానీ, మెరుపు దాడి చేస్తాయి..!

భూమిపై వేలాది రకాల పాములు ఉన్నాయి. కొన్ని చాలా వేగంగా, చురుగ్గా ప్రవర్తిస్తాయి. అత్యంత విషపూరితంగా ఉంటాయి. మరికొన్ని తొందరపడవు. అవి సోమరిగా కనిపిస్తాయి. అవును ప్రపంచంలో కొన్ని పాములు సోమరితనంగా కనిపిస్తాయని మీకు తెలుసా..? కానీ, అవి దాడి చేసినప్పుడు మాత్రం వాటి ఆహారం తప్పించుకునే అవకాశం ఉండదు. ? ఈ పాములు సోమరితనం అయినప్పటికీ ప్రాణాంతకమైనవి..దానికి ఆహారం కావాల్సినప్పుడు మాత్రం అత్యంత భయంకరంగా వేటాడుతాయట. అలాంటి సోమరిపోతు పాముల గురించి కొంత సమాచారం ఇక్కడ చూద్దాం..

Snakes: ఈ పాములు సొమరితనానికి బ్రాండ్అంబాసిడర్.. కానీ, మెరుపు దాడి చేస్తాయి..!
Snakes
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2025 | 5:24 PM

Share

సోమరి పాములు అంటే రోజంతా ఎక్కువ కదలకుండా, ఎక్కువ సమయం నీరసంగా గడిపేవి. వాటి బరువైన శరీర నిర్మాణం వల్ల అవి త్వరగా కదలలేవు. అవి ఎరను పట్టుకోవడానికి గంటల తరబడి వేచి ఉండి, అకస్మాత్తుగా మెరుపులా దాడి చేస్తాయి. సోమరితనంతో తక్కువగా కదలే ఇలాంటి సోమరిపోతు పాములు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపించినప్పటికీ, అవి దాడి చేయగల అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటి ప్రవర్తన వాటి నిర్మాణం, వేట పద్ధతులు, ఆవాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పాములు సాధారణంగా అడవులు, చిత్తడి నేలలు లేదా ఆకుల మధ్య కనిపిస్తాయి.

అలాంటి కొన్ని సోమరిపోతు పాములు

* బోవా కన్‌స్ట్రిక్టర్:

ఇవి కూడా చదవండి

పెద్ద, బరువైన శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా చెట్లపై లేదా నేలపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. ఎర కోసం కాపు కాస్తాయి. అకస్మాత్తుగా దాడి చేస్తాయి. ఎర దగ్గరకు వచ్చినప్పుడు రెప్పపాటులో దూకి దాని చుట్టూ చుట్టుకుని, దానిని ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఇవి ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ తక్షణమే చంపేస్తాయి.

* కొండచిలువ:

ఇవి పెద్దవి, బరువైన పాములు. వీటిని పైథాన్‌ అని కూడా అంటారు..వీటిని సోమరి పాములుగా కూడా పరిగణిస్తారు. అవి ఎక్కువగా తిరగవు. ఎక్కువ సమయం అవి నిద్రాణ స్థితిలో ఉండి, ఎరను పట్టుకోవడానికి అకస్మాత్తుగా దాడి చేస్తాయి. ఈ పాములు ఎక్కువగా అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలలో కనిపిస్తుంది.

* అనకొండ:

ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన పాముగా పరిగణించబడుతుంది. ఇది తరచుగా నీటిలో లేదా నీటిలో దగ్గరగా సోమరిగా ఉంటుంది. ఇది కొద్దిగా కదిలినప్పటికీ, దాని దాడి నుండి ఆహారం తప్పించుకోవడం అసాధ్యం. ఈ పాము చిత్తడి నేలలు, నదులు, సరస్సులలో కనిపిస్తుంది.

* గబూన్ వైపర్:

ఈ ఆఫ్రికన్ పాము దాని బరువైన శరీర నిర్మాణం, బద్ధకమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది. ఇది గంటల తరబడి ఆకులు లేదా మట్టిలో దాక్కుంటుంది. ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు, ఒకే దెబ్బతో ప్రాణాంతక దాడిని ప్రారంభిస్తుంది. దీని విషం చాలా ప్రమాదకరమైనది. నిమిషాల్లోనే ఎరను చంపగలదు.

ఈ పాములు ఎందుకు సోమరిగా ఉన్నాయి?

వాటి శరీరాలు చాలా పెద్దవిగా, బరువుగా ఉండటం వలన అవి ఎక్కువసేపు అధిక వేగంతో కదలలేవు. ఇంకా, వాటి వేట పద్ధతి దాని వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు వేచి ఉండి దాడి చేస్తుంది.. ఇది వాటికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..