ఈ ప్రదేశంలో కూర్చుని తింటే పేదరికం పెరుగుతుంది..! ఒక్క రూపాయి కూడా అప్పు చేయాల్సిన దుస్థితి వస్తుంది..!!
చాలా మందికి మంచం మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది. కానీ, ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. మంచం మీద కూర్చుని తింటే దరిద్రం పడుతుంది అని.. కానీ, దాదాపుగా ఎవరూ పట్టించుకోరు. కానీ, ఇది నిజంగా మంచిది కాదని వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచం మీద కూర్చొని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. మంచం మీద కూర్చుని తినడం అంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అంటున్నారు..పూర్తి వివరాల్లోకి వెళితే..

సంపదకు సంబంధించిన అనేక నియమాలను వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంటికి శ్రేయస్సును అందిస్తుంది.. జీవితం ఆనందం,సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇందుకోసం కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా వాస్తు శాస్త్రం సూచిస్తుంది. వాస్తు నియమాలకు విరుద్ధంగా చేసే కొన్ని చర్యలు గణనీయమైన నష్టాలకు దారితీయవచ్చు అంటున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. ఇలాంటి పనులు జీవితంలో ప్రతికూలతను కలిగిస్తాయి. అలాంటి ఒక అలవాటు మంచం మీద కూర్చొని తినడం. మంచం మీద కూర్చొని తినడం సర్వసాధారణం.. కానీ, ఈ అలవాటు మీ జీవితంలో ఎంతపెద్ద హానిని కలిగిస్తుందో మాటలో చెప్పాలేం అంటున్నారు. ఇది దురదృష్టాన్ని ఆహ్వానించడమే అంటున్నారు నిపుణులు.
వాస్తు ప్రకారం, మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో పేదరికం పెరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.. తల్లి అన్నపూర్ణదేవి ఇది కోపం కలిగిస్తుందని చెబుతున్నారు. అన్నపూర్ణ దేవి కోపం ఇంటి నుండి శ్రేయస్సును నాశనం చేస్తుందని, డబ్బు రాక నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు.
మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్యం, తగాదాలు, ఘర్షణలు పెరుగుతాయి. ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుంది. ఇది పనికి ఆటంకం కలిగిస్తుంది. పురోగతిలో ఉన్న పని ఆగిపోతుంది. కష్టపడి పనిచేయడం, సామర్థ్యం ఉన్నప్పటికీ పురోగతి సాధించలేము. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల రాహువు దుర్మార్గపు ఫలితాలను కలిగిస్తాడు. మంచి జీవితాన్ని కూడా నరకంగా మారుస్తాడని సూచిస్తున్నారు.
ఇంకా గుర్తుంచుకోండి: ఎల్లప్పుడూ నేలపై డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. తినడానికి ముందు అన్నపూర్ణ దేవికి ధన్యవాదాలు చెప్పండి. రాత్రిపూట వంటగదిని ఎప్పుడూ మురికిగా ఉంచవద్దు. మురికి పాత్రలను ఉంచవద్దు. అలాగే, తినేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోండి.
Note : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








