- Telugu News Photo Gallery Spiritual photos Gaja Kesari Yoga: These Zodiac Signs to Prosper Jupiter Moon Conjunction Benefits
Gaja Kesari Yoga: గురు, చంద్రుల యుతి.. కుంభ స్థలాన్ని కొట్టబోతున్న రాశులివే..!
Lucky Zodiac Signs: ఈ నెల(అక్టోబర్) 12, 13, 14 తేదీల్లో మిథున రాశిలో గురు, చంద్రుల యుతి జరగబోతోంది. గురు చంద్రులు ఒకే రాశిలో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ అదృష్ట యోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక విధాలుగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో అత్యంత ఉత్తమ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ యోగం ప్రస్తుతం వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశులవారికి అత్యంత యోగ దాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.
Updated on: Oct 11, 2025 | 8:15 PM

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. కొద్ది కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా లాభసాటిగా అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో గురు, చంద్రులు కలవడం వల్ల, ఇందులో గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసులోనే సంచారం చేస్తున్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, రాబడి వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది.

సింహం: చంద్రుడు లాభ స్థానంలో గురువుతో కలవడం వల్ల విదేశీయానానికి, విదేశీ అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. లాభదాయక సంబంధ బాంధ వ్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు, చంద్రుల యుతి చోటు చేసుకుంటున్నందువల్ల ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబం ధం ఖాయ మయ్యే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లేదా సంపద కలిసి వచ్చే సూచనలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందుతారు.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో అంద లాలు ఎక్కుతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు, బంధుమిత్రులు బాగా లబ్ధి పొందుతారు.



