- Telugu News Photo Gallery Spiritual photos Dhanteras 2025: These Zodiac Signs to Get Wealth and Prosperity for 45 Days Details in Telugu
Dhanteras 2025: ధన త్రయోదశితో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం..ధన, మహా భాగ్య యోగాలు..!
Dhanteras 2025 Astrology: ఈ నెల (అక్టోబర్) 18న వచ్చే ధన త్రయోదశి (ధన్ తేరస్) నుంచి కుజ, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని రాశులకు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు, మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ధన్ తేరస్ నుంచి 45 రోజుల పాటు ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహ, వాహన యోగాలు కలగడం, అన్నిటికంటే ముఖ్యంగా మనసులోని ప్రధానమైన కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. ధన్ తేరస్ రోజున ఇతర రాశులవారితో పాటు ఈ రాశుల వారు కూడా తప్పకుండా లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారి జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపబోతోంది.
Updated on: Oct 11, 2025 | 8:03 PM

మేషం: ఈ రాశికి రాహువుతో పాటు రాశ్యధిపతి కుజుడు, బుధ, రవులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ధన పరంగా ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా రెండు మూడు రెట్ల ఫలితాలు అనుభవానికి వస్తాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి శనీశ్వరుడితో పాటు రాశ్యధిపతి శుక్రుడు, బుధ, కుజులు అనుకూలం అవుతున్నందు వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. విలాస జీవితం గడపడానికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిత్రార్జితం కూడా లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి రాశ్యధిపతి చంద్రుడు, కుజుడు, శుక్ర, బుధులు అనుకూలంగా మారుతున్నందు వల్ల ధన్ తేరస్ నుంచి ఈ రాశివారి జీవితం కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. అదనపు రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి బాగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశికి గురువు, రాశ్యధిపతి బుధుడు, కుజుడు, శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు లాభాలు బాగా పెరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనేక విధాలుగా ధనా దాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

వృశ్చికం: ఈ రాశికి రవి, బుధులతో పాటు రాశ్యధిపతి కుజుడు, శుక్రుడు అనుకూలంగా మారుతున్నం దువల్ల ఈ నెల 18 నుంచి ఆర్థికపరంగా ఈ రాశివారి దశ తిరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా అనుకున్న ప్రయత్నాలు అనుకున్నట్టు నెరవేరుతాయి. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆస్తి వివాదం, కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనితో పాటు కుజుడు, బుధ, రవులు, శుక్రుడు అంచనాలకు మించి అను కూల ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు పరిష్కారమై, మనశ్శాంతి ఏర్పడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.



