Diwali 2023: దీపావళి రోజున లక్ష్మి, గణపతి పూజ కోసం ఇలాంటి విగ్రహాలు తీసుకురండి.. కష్టాలు తీరతాయి..
దీపావళి రోజున కొత్త లక్ష్మీ దేవి విగ్రహాన్ని దీపావళి రోజున ఇంటికి తీసుకువస్తే.. నిలబడి ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదని పండితులు చెప్పారు. అలా కాకుండా లక్ష్మీదేవి కూర్చున్న విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావాలి. అందునా లక్ష్మీదేవి ఒక చేత్తో దీవెన ఇస్తున్నట్లు.. మరో చేతిలో ధనం పట్టుకున్నట్లు ఉండే లక్ష్మీ దేవి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
![Diwali 2023: దీపావళి రోజున లక్ష్మి, గణపతి పూజ కోసం ఇలాంటి విగ్రహాలు తీసుకురండి.. కష్టాలు తీరతాయి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/diwali-lakzmi-puja.jpg?w=1280)
దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ రోజున లక్ష్మీ దేవి, గణపతి పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య చీకటిని దీపాల వెలుగుతో పారద్రోలుతూ దేదీప్య మనంగా వెలిగేలా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన లేదా లోహపు లక్ష్మీ , గణేషుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అన్ని దేవుళ్ల విగ్రహాలు మంచివిగా భావించినప్పటికీ జ్యోతిష్యులు దీపావళి పూజకు ప్రత్యేక విగ్రహాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ఇంట్లోకి తీసుకొచ్చిన కొత్త విగ్రహాలకు పూజలు చేయడం చాలా శ్రేయస్కరం.
ఏ వినాయకుడి విగ్రహం కొనాలంటే?
దీపావళి రోజున కొత్త గణపతి విగ్రహాన్నిఇంటికి తీసుకువస్తున్నట్లయితే.. గణేశుడి తొండం విగ్రహానికి కుడి వైపుకు వంగి ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వినాయకుని విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఈ విగ్రహాన్ని పూజించడం చాలా శుభప్రదం.
ఏ లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనాలిలంటే?
దీపావళి రోజున కొత్త లక్ష్మీ దేవి విగ్రహాన్ని దీపావళి రోజున ఇంటికి తీసుకువస్తే.. నిలబడి ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదని పండితులు చెప్పారు. అలా కాకుండా లక్ష్మీదేవి కూర్చున్న విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావాలి. అందునా లక్ష్మీదేవి ఒక చేత్తో దీవెన ఇస్తున్నట్లు.. మరో చేతిలో ధనం పట్టుకున్నట్లు ఉండే లక్ష్మీ దేవి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ఏ విగ్రహం కొనాలి మట్టిదా లేదా లోహానిదా?
దీపావళి పూజల కోసం మట్టితో చేసిన లేదా లోహపు లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అయితే దీపావళి రోజున చేసే పూజ కోసం ఇంటికి లేదా ఆఫీసుకు తీసుకుని వచ్చే విగ్రహం చాలా పెద్దదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు