శ్రీరాముడికి సోదరి ఉందా? దశరథుని నలుగురు కుమారులకూ తెలియని రహస్యం!
భూమిపై ధర్మాన్ని పునఃస్థాపించేందుకు త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అందుకే ఈ యుగాన్ని ఆదర్శాలు, విలువలు ప్రతిబింబించే యుగంగా భావిస్తారు. ఈ కాలంలో శ్రీరాముడు తన జీవితం అంతటా అనేక అద్భుతమైన కార్యాలను నిర్వర్తించాడు. వ్యక్తిత్వం, నైతికత, కర్తవ్య నిష్ఠల విషయంలో నేటి కుటుంబంలోని ప్రతి వ్యక్తీ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు ఉపదేశిస్తారు. రామాయణం గురించి అందరికీ తెలుసు కానీ.. శ్రీరాముడికి ఒక సోదరి ఉందని మాత్రం చాలా మందికి తెలియదు.

భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు త్రేతాయుగంలో శ్రీ మహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అందుకే, ఈ యుగం ఆదర్శాలు, విలువల యుగంగా పరిగణించడం జరుగుతుంది. ఈ యుగంలో శ్రీరాముడు తన జీవితంలో అనేక అద్భుత కార్యాలను నిర్వహించాడు. వ్యక్తిత్వంలో నేటి కుటుంబంలోని ప్రతీ వ్యక్తి కూడా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. శ్రీరాముడి జీవిత చరిత్ర దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.
రామాయణం, రామచరిత మానస్ వంటి పవిత్ర గ్రంథాలు రాముడి మొత్తం జీవితాన్ని వివరిస్తాయి. రామాయణంలోని అన్ని పాత్రల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దశరథుడికి ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇక, నలుగురు కుమారులు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఉన్నారు. ఇక్కడి వరకు అందరికీ తెలుసు.
కానీ, శ్రీరాముడికి శాంత అనే సోదరి కూడా ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామాయణంలోనూ శాంత గురించి చాలా అరుదుగా ప్రస్తావించారు. నలుగురు సోదరులలో శాంత అక్క. రాముడి సోదరి శాంతకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శాంత.. దశరథుడు-కౌసల్య కూతురు
శాంత.. దశరథ మహారాజు-కౌసల్య దంపతుల కుమార్తె. ఆమెను అంగరాజు రోమపాదుడు, అతని భార్య వర్షిని దత్తత తీసుకున్నారు. వర్షిని కౌసల్య తల్లి అక్క. వారికి పిల్లలు లేరు. ఒకసారి వర్షిని తన సోదరిని చూసేందుకు తన భర్తతో అయోధ్యకు వచ్చింది. ఆమె శాంతను దత్తత తీసుకోవాలనే తన కోరికను దశరథ రాజు, కౌసల్య తల్లికి తెలియజేసింది. దీంతో వర్షిణి మాటలు విన్న దశరథుడు తన కుమార్తె శాంతను ఆమెకు దత్తత ఇస్తానని వాగ్ధానం చేశాడు. దీంతో శాంత అంగరాజు యువరాణి అయ్యింది. అయితే, శాంత తర్వాత దశరథుడికి పిల్లలు పుట్టలేదు.
దశరథుడు తన రాజవంశం కొనసాగించడానికి అతను ఒక కొడుకును కోరుకున్నాడు. అందువల్ల దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేసేందుకు శృంగ మహర్షిని పిలిపించాడు. యజ్ఞం ఫలితంగా శ్రీరాముడు, భరతుడు, కవలలు లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు. ఆ తర్వాత అంగదేశ యువరాణి శాంత.. శృంగ మహర్షిని వివాహం చేసుకుంది. శృంగ మహర్షి తన భార్య శాంతతో కలిసి పుత్ర కామేష్టి యాగం కోసం అయోధ్యకు వచ్చాడు. అక్కడ శాంత.. దశరథ రాజు పాదాలను తాకి, కుమార్తెగా తన గుర్తింపును వెల్లడించింది. అయితే, అప్పటికి రాముడు, అతని సోదరులు జన్మించకపోవడంతో వారికి ఈ విషయం తెలియదని తెలుస్తోంది.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.
