AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2025: ధన్‌తేరాస్ రోజున ఈ వస్తువులు కొన్నారో మీ కొంప కొల్లేరే.. జాగ్రత్త సుమా..

ధన త్రయోదశి రోజున బంగారం, వెండి , ఉప్పు వంటివి కొనడం మంచిది అని ఎలా నమ్ముతున్నారో.. అదే విధంగా ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు. ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకుని వస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇంట్లో పేదరికం కొలువై ఉంటుంది. కనుక ఈ రోజు ధన త్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొనకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

Dhanteras 2025: ధన్‌తేరాస్ రోజున ఈ వస్తువులు కొన్నారో మీ కొంప కొల్లేరే.. జాగ్రత్త సుమా..
DhanatrayodashiImage Credit source: AI
Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 3:17 PM

Share

ఐదు రోజుల దీపావళి పండుగ ధన్ తేరాస్ తో ప్రారంభమవుతుంది. దీనిని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలోని పదమూడవ రోజు త్రయోదశి తిథిని ధన్ తేరాస్ జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరికి పూజలు చేస్తారు. ఈ రోజున కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధన్ తేరాస్ నాడు షాపింగ్ చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.

ఈ ఏడాది ధన త్రయోదశి పండగను అక్టోబర్ 18వ తెదీ శనివారం జరుపుకుంటారు. అయితే ధన్ తేరస్ నాడు కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడింది. ముఖ్యంగా ఏడు వస్తువులను కొనకూడదు అని నమ్మకం ఉంది. ఈ వస్తువులను కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లోకి పేదరికం వస్తుంది. కనుక ధన్ తేరస్ నాడు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం.

ఇనుముతో తయారు చేసిన వస్తువులు: ధన్‌తేరాస్ నాడు లోహం కొనడం సాంప్రదాయంగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇనుప వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది.నమ్మకం ప్రకారం ఇనుము శని దేవుడికి చిహ్నం. ధన్‌తేరాస్ నాడు ఇనుము కొనడం దురదృష్టాన్ని తెస్తుంది.

ఉక్కుతో తయారు చేసిన వస్తువులు: ధన్‌తేరస్ నాడు స్టీల్ పాత్రలు లేదా ఇతర వస్తువులను కొనవద్దు. కనుక ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకుండా ఉండండి.

గాజుతో చేసిన వస్తువులు: గాజును రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు. కనుక ధన్ తేరస్ రోజున గాజుతో చేసిన వేటినీ కొనకూడదు. ఎందుకంటే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది.

పదునైన వస్తువులు: ధన్‌తేరాస్ నాడు సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన లేదా కోణాలున్న వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇంట్లోకి పదునైన వస్తువులను తీసుకురావడం వల్ల దురదృష్టం, ప్రతికూలత వస్తుందని నమ్ముతారు.

ఖాళీ పాత్ర: ధన్‌తేరస్ నాడు పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ పాత్రలను తీసుకువెళ్ళకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ పాత్రలు ఇంట్లో శూన్యతను సూచిస్తాయి.

నల్లటి వస్తువులు: ధన్‌తేరాస్ నాడు నల్లని వస్తువులను కొనకూడదు. నల్లని వస్తువులను అశుభకరమైనవిగా భావిస్తారు. కనుక ధన్‌తేరాస్ నాడు నల్లని వస్తువులు లేదా దుస్తులు కొనవద్దు.

నూనె, నెయ్యి: ధన్‌తేరాస్ నాడు నూనె , నెయ్యి కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. మీకు అవి అవసరమైతే ధన్‌తేరాస్‌కు ఒక రోజు ముందు వాటిని కొనుగోలు చేయాలి. ధన్‌తేరాస్ నాడు నూనె, నెయ్యి కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us