AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2023: ధన్‌తేరస్ రోజున కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. శుభ సమయంలో షాపింగ్ చేయండి..

ధన్‌తేరస్ రోజున ప్రజలు బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కొత్త కార్లు, స్కూటర్లు మొదలైనవి కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్ పండుగ దీపావళికి 2 రోజుల ముందు ఆశ్వయుజ మాసం త్రయోదశి నాడు వస్తుంది. కొత్త కారు కొనాలనేది ప్రతి ఒక్కరి కల. వాహనం ఇంటికి రెండవ ఆస్తి. అటువంటి పరిస్థితిలో ప్రజలు దీపావళి,  ధన్‌తేరస్ వంటి శుభ సందర్భాల్లో కార్లను కొనుగోలు చేస్తారు.

Dhanteras 2023: ధన్‌తేరస్ రోజున కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. శుభ సమయంలో షాపింగ్ చేయండి..
Dhanteras 2023
Surya Kala
|

Updated on: Nov 09, 2023 | 8:45 AM

Share

ధన్‌తేరస్ రోజున షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ మీరు ధన్‌తేరస్ రోజున ఎప్పుడైనా షాపింగ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజు మొత్తం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రోజు కొనడం మంచిదని విశ్వాసం. మీరు కొత్త కారును కొనుగోలు చేసే  ఆలోచన చేస్తుంటే.. కారు కొనుగోలు చేసే శుభ సమయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ధన్‌తేరస్ రోజున ప్రజలు బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కొత్త కార్లు, స్కూటర్లు మొదలైనవి కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్ పండుగ దీపావళికి 2 రోజుల ముందు ఆశ్వయుజ మాసం త్రయోదశి నాడు వస్తుంది. కొత్త కారు కొనాలనేది ప్రతి ఒక్కరి కల. వాహనం ఇంటికి రెండవ ఆస్తి. అటువంటి పరిస్థితిలో ప్రజలు దీపావళి,  ధన్‌తేరస్ వంటి శుభ సందర్భాల్లో కార్లను కొనుగోలు చేస్తారు.

ఈ సంవత్సరం ధన్‌తేరస్ 10 నవంబర్ 2023 న జరుపుకుంటారు. ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల సంపదలు చేకూరుతాయని మత విశ్వాసం. అలాగే కుబేరుడు, తల్లి లక్ష్మిదేవి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ధన్‌తేరాస్‌ రోజున చాలా మంది కారు కొనాలని ప్లాన్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వాహనాన్ని ఏ శుభ ముహూర్తంలో కొనుగోలు చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

కారు కొనడానికి శుభ సమయం

ధన్‌తేరస్ రోజున చర లగ్నములో వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలా మంది ప్రజలు ఈ శుభ సమయంలో కారు కొంటారు. ఎందుకంటే ఈ లగ్నం చాలా శుభప్రదం. ఈ ధన్‌తేరస్‌లో ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే పగలు చర లగ్నంలో మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:35 గంటల వరకు వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని జ్యోతిష్యులు చెప్పారు. ఉదయం 10 గంటల నుండి 11:58 గంటల వరకు వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. వాహనం కొనడానికి ఈ రెండు సమయాలు అనుకూలం.

వాహనం కొనుగోలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు

  1. ధన్‌తేరస్ రోజున శుభ సమయంలో మాత్రమే షాపింగ్ చేయాలి. అప్పుడే  శుభ ఫలితాలు లభిస్తాయి.
  2. ధన్‌తేరస్ రోజున కొనుగోలు చేసిన కారును తప్పనిసరిగా పూజించి, ఆ తర్వాత మాత్రమే ఉపయోగించాలి.
  3. ధన్‌తేరస్ రోజున కారు కొన్న తర్వాత అందులో పసుపు గుడ్డ కట్టాలి.
  4. ధన్‌తేరాస్‌లో వాహనం కొనుగోలు చేసేటప్పుడు రాహుకాలంలో కొత్త వాహనం కొనుగోలు చేయకూడదని గుర్తుంచుకోండి.
  5. ధన్‌తేరస్‌లో వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ వాహనాన్ని ఇంటి యజమానురాలు లేదా పూజారితో పూజ చేయించండి.
  6. కారు కొన్న తర్వాత కారుపై స్వస్తిక చిహ్నాన్ని పెట్టండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి