Mahanandi Temple: శైవ క్షేత్రం మహానంది దినదినాభివృద్ధి.. అవినీతిని అరికడుతూ చర్యలు.. 16 నెలల్లో 24 మంది ఉద్యోగులు సస్పెండ్..
నంద్యాలలో జిల్లాలో ఉన్న రెండు మేజర్ టెంపుల్స్ లో మహానంది క్షేత్రం ఒక్కటి. మహానంది క్షేత్రంకు తీర్థ క్షేత్రంగా పేరుంది. ఆలయంలోనే ఉండే రుద్రగుండ, బ్రహ్మ, విష్ణు గుండం అనే మూడు కోనేరులు ఆలయంకు ప్రత్యేక ఆకర్షణ. ఆలయంకు ఎపి, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు.

సుప్రసిద్ధ శైవ క్షేత్రం క్షేత్రం మహానందిలో ఏం జరుగుతోంది? 16 నెలల వ్యవధిలో 24 మంది ఉద్యోగులు ఎందుకు ఎందుకు సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి జరుగుతోందా? లేక అంతర్గతంగా జరుగుతున్న అవినీతి డొంక కదులుతోందా? దేవుడి, భక్తుల సొమ్ము తినడం లో ఏమాత్రం భయం లేకుండా పోయిందా? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.. నల్లమల కొండల అందాల మద్య ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్న మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. నంద్యాల జిల్లాలోని శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి క్షేత్రం ఏపీ లోని మిగతా క్షేత్రాలకు ఒక రోల్ మాడల్ క్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది అంటే అవుననే చెప్పాలి.
ఆలయంలో దాదాపు 16 నెలల కాలంలో 14 మంది పర్మినెంట్ ఉద్యోగులు, ఆరుగురు ఏజెన్సీ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురికాగా మరో నలుగురు ఏజెన్సీ ఉద్యోగాలు పని మానుకొని వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆలయంలో నిరంతరం 95 సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యడంతో పాటు కెమెరాల పర్యవేక్షణకు ఒక అధికారి నియమించడంతో ఆలయంలో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి వీలౌతుంది.
గతంలో మూడు నెలల కాలంలో రూ. 25 లక్షలు వచ్చే హుండీ ఆదాయం ప్రస్తుతం ఒక నెలలోనే రూ.35 లక్షలు రావడం చూస్తే అర్థం చేసుకోవచ్చు. హుండీ ఆదాయం పెరగటానికి ఉద్యోగుల పై తీసుకున్న కఠినమైన చర్యలు, ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణనే ప్రధాన కారణం అంటున్నారు అంటున్నారు హిందూ దేవాలయాల నాయకులు.
నంద్యాల జిల్లాలో ఉన్న రెండు మేజర్ టెంపుల్స్ లో మహానంది క్షేత్రం ఒక్కటి. మహానంది క్షేత్రానికి తీర్థ క్షేత్రంగా పేరుంది. ఆలయంలోనే ఉండే రుద్రగుండ, బ్రహ్మ, విష్ణు గుండం అనే మూడు కోనేరులు ఆలయంకు ప్రత్యేక ఆకర్షణ. ఆలయంకు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు.
ఆలయంలో దాతల సహకారంతో దాదాపు రూ.3 కోట్ల, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, ఆలయ సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
గతంలో ఆలయం బ్యాంక్ అకౌంట్ లో రూ. 65 లక్షల నిల్వుండగా ప్రస్తుతం సుమారు రూ.10 కోట్లకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయంకు వచ్చే నెల ఆదాయం పై ఉద్యోగులు, అర్చకుల జీతభత్యాలు ఆధారపడే పరిస్థితి నుంచి ప్రతి నెల జీతాలు సరైన సమయానికి ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు.
- ఎక్కడిఎక్కడి నుంచో వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి రూ.4.6కోట్లు,దాతల సహకారంతో రూ.10.5 కోట్ల మొత్తం 82 వసతి గృహాలను నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
- ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో ఆలయం ముందర నంది సర్కిల్,ఆలయం చుట్టు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
- దివిస్ లేబరేటరీస్ సహకారంతో రూ.65 లక్షలతో భక్తులకు మూడు మంచి నీటి ప్లాంట్ లను ఆలయంలో ఏర్పాటు చేశారు.
- ఆలయం మూడు పుష్కరిణిలలో రూ.80 లక్షలతొ మరమ్మత్తులు.
- రూ.21లక్షలతో శ్రీ కామేశ్వరి అమ్మవారి ముఖ ద్వారంకు వెండి తొడుగు
- రూ. 70 లక్షలతో స్వామివారి గర్భాలయం ముఖ ద్వారం కు వెండి తొడుగు
- రూ.30 లక్షలతో ఆలయ ప్రధాన ద్వారంకు ఇత్తడి ద్వారం
- 37 కిలోల వెండితో గర్బాలయంలో రుద్రాక్ష మండపం
- రూ.68 లక్షలతో స్వామి,అమ్మవార్ల ఆలయం చుట్టు ఇత్తడి కటాంజనములు
- ఆలయం రెండవ ప్రకారంలో రాహు,కేతు మండపం
- అన్నప్రసాద కేంద్రం స్టీల్ టేబుల్ ఏర్పటు చెయ్యడం తో పాటు భక్తుల రద్దీ దృష్ట్యా రెండు వందల నుంచి మూడు వందల మందికి ప్రతి రోకు అన్నదానం నిర్వహించడం
ఇలా ఆలయంలో నిరంతర పర్యవేక్షణ తో పాటు ఎక్కడా కూడా తప్పులు జరగకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దాతల సహకారంతో ఆలయ దినదినాభివృద్ధి చెందడం గమనించదగిన విషయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..