CJI NV Ramana Yadadri tour: యాదాద్రికి సతీసమేతంగా సీజేఏ ఎన్వీ రమణ..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా ఇవాళ (మంగళవారం) యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు.

CJI NV Ramana Yadadri tour: యాదాద్రికి సతీసమేతంగా సీజేఏ ఎన్వీ రమణ..
Cj Nv Ramana
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2021 | 6:18 AM

CJI NV Ramana Yadadri tour: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం  యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు మీదుగా రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. ఉదయం7గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమై, ఉదయం 8.30నిమిషాలకు యాదాద్రి చేరుకుంటారు. ఇక, గుట్ట మీద కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి ఎన్వీ రమణ నేరుగా చేరుకోనున్నారు.

మంగళవారం ఉదయం 8.45నిమిషాలకు శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌ స్వామి వారిని ద‌ర్శించుకోనున్నారు ఎన్వీ రమణ దంపతులు. అనంత‌రం స్వామి వారి ఆశీర్వచ‌నం తీసుకోనున్నారు. 9గంటల 15నిమిషాలకు ఆల‌య పున‌ర్ నిర్మాణ పనులను ప‌రిశీలించ‌నున్నారు. ఉదయం 9గంటల 45నిమిషాలకు వీవీఐపీ గెస్ట్ హౌజ్‌లో బ్రేక్ ఫాస్ట్ చేయ‌నున్నారు. అనంతరం ఉద‌యం 10 గంట‌ల‌కు టెంపుల్ సిటీని సంద‌ర్శించి, హైద‌రాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

అయితే, ముందుగా అనుకున్నట్లు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీలు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో పాటు యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వారి పర్యటన రద్దైంది. అయితే రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలకనున్నారు. వారితో పాటు యాదగిరిగుట్ట పర్యటనలో పాల్గొంటారు.

ఇవి కూడా చవండి : Novavax: కరోనాపై పోరుకు మరో వ్యాక్సిన్..నోవావాక్స్ క్లినికల్ ట్రైల్స్ సక్సెస్..త్వరలో అందుబాటులోకి!