- Telugu News Spiritual Chanakya Niti Whoever made these 5 mistakes in young age his life is sure to be ruined
Chanakya Niti: యవ్వనంలో ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే జీవతం ఆగమవడం ఖాయం..!
Chanakya Niti: కొలిమిలో కాలిస్తేనే ఇనుముకు ఒక రూపం ఇవ్వొచ్చు అన్నట్లుగా.. భవిష్యత్తులో మంచి జీవితాన్ని పొందాలంటే, యవ్వనంలో మిమ్మల్ని మీరు కాల్చుకోవాల్సి ఉంటుంది. యవ్వనంలో, ఒక వ్యక్తికి ఉత్సాహం, బలం, ధైర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్ సుఖమయం అవుతుంది. కానీ, దుర్వినయోగం చేస్త.. జీవితం నాశనం అవడం ఖాయం.
Updated on: Jan 06, 2022 | 7:17 AM

వ్యక్తి యవ్వనంలో శక్తి, యుక్తలు కలిగి ఉంటారు. కానీ, కొందరు మాత్రం తమ సోమరితనం కారణంగా విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. స్వంత సామర్ధ్యాలను నాశనం చేసుకుంటారు. సోమరితనం అనేది యువతకే కాదు, ప్రతి వ్యక్తికీ శత్రువు. జీవితంలో సోమరితనానికి చోటు ఇవ్వకూడదు.

ఏ పని అయినా పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో చేయాలి. నిర్లక్ష్యం లాంటి పదాలు యువత నిఘంటువులో ఉండకూడదు. అజాగ్రత్తగా ఉంటే జీవితాంతం దాని ఫలితాన్ని భరించాల్సి వస్తుంది.

వ్యసనం ఏ వ్యక్తి జీవితాన్ని అయినా నాశనం చేస్తుంది. ఇది మీ డబ్బును వృధా చేస్తుంది. అలాగే మీ శారీరక, మానసిక సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. సమర్థత ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రాణించలేరు.

అసహవాసం యుక్తవయస్సులోనే కాదు, ఏ దశలోనైనా హాని చేస్తుంది. యవ్వనంలో ఒక వ్యక్తి తన స్నేహితులు, సన్నిహితుల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని తప్పు దిశలో తీసుకెళతారు. మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు.

సెక్స్ వ్యసనం కూడా యువత జీవితాన్ని నాశనం చేస్తుంది. దీని వల్ల వారి శరీరం కూడా పాడైపోతుంది. వారి ఆలోచనలు కూడా చెడిపోతాయి. కాబట్టి యువత తమపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.
