Chanakya Niti: అందరూ మనవాళ్ళే అని మనసులోని మాట వీరికి చెప్పారంటే మీ గోతిని మీరు తవ్వుకున్నట్లే..
ఆచార్య చాణక్యుడి వేల సంవత్సరాల క్రితం మానవ జీవితానికి సంబంధించిన బోధనలు నేటికీ అందరూ పాటించడానికి ఉపయుక్తం అని పెద్దలు చెబుతారు. అలా చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన విషయాల్లో ఒకటి అందరూ మనవాళ్ళే.. కానీ ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం తెలివైన పని కాదు. సరైన వ్యక్తితో పంచుకున్న విషయాలు మీ జీవితాన్ని సులభతరం చేస్తాయనే నియమం. మనవారు అనుకుని చెప్పే విషయాలు కొన్ని సార్లు ముప్పు తెస్తాయని.. సమస్యలను సృష్టించవచ్చని చాణక్య బోధనలు చేశాడు.

ఆచార్య చాణక్యుడిని గుర్తు చేసుకుంటే.. ఆయన తెలివి తేటలు, జ్ఞానం, రాజకీయాలు, జీవితానికి సంబంధించిన చెప్పిన అనేక విషయాలను గుర్తుచేసుకుంటాం. ఆయన రాజకీయాలు, డబ్బు గురించి మాత్రమే కాదు.. మానవ ప్రవర్తన, సంబంధాల గురించి కూడా అనేక విషయాలు చెప్పాడు. అవి నేటి కాలంలో కూడా పాటించడం వలన జీవితం సంతోషంగా సాగుతుందని నమ్మకం. మనం ఎప్పుడు, ఎవరికి, ఏమి చెప్పాలో, ఏమి చేయాలో చాణక్య నీతి ప్రత్యేకంగా మనకు చెబుతుంది. చాణక్య ప్రకారం ప్రతి విషయం అందరికీ చెప్పడం సరైనది కాదు. తప్పుడు వ్యక్తులను చెబితే.. అతను సమస్యలను సృష్టిచే అవకాశం ఉంది. కనుక ఆచార్య చాణక్యుడు తెలివిగా మాట్లాడాలని.. మీ ఆలోచనలను సరైన వ్యక్తితో మాత్రమే పంచుకోవాలని సలహా ఇచ్చాడు. కనుక ఈ రోజు మీ ఆలోచనలను ఎప్పుడు పంచుకోవాలి? ఎవరితో పంచుకోకూడదో తెలుసుకుందాం.
ప్రతి రహస్యం అందరికీ చెప్పరాదు ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో అందరికీ బహిర్గతం చేయకూడని కొన్ని విషయాలు ఉంటాయి. అది మీ బలహీనత, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత సంబంధం లేదా మీ భవిష్యత్తు ప్రణాళిక కావచ్చు. మీరు పూర్తిగా విశ్వసించే, మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తితో మాత్రమే ఈ విషయాలను పంచుకోవాలి. మీరు చెప్పే విషయాలు తప్పుడు వ్యక్తి వద్దకు చేరితే.. అతను ఆ విషయాలను సద్వినియోగం చేసుకుని మీకు చెడు చేయడానికి ఆలస్యం చేయడు.
నిజమైన స్నేహితుడితో మాత్రమే పంచుకోండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో నిజమైన స్నేహితులు అంటే ఎటువంటి పరిస్థితి ఎదురైనా..మంచి, చెడు సమయాల్లో మీకు తోడుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తులు మీరు చెప్పే మాట జాగ్రత్తగా వినడమే కాకుండా సరైన సమయంలో సరైన సూచనలు కూడా ఇస్తారు. అలాంటి స్నేహితుడే నిజమైన నిధి అని, మీరు మీ సమస్యలు, దుఃఖాలు, సంతోషం, మీ ఆలోచనలను అతనితో పంచుకోవచ్చని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
బంధువులతో జాగ్రత్త సుమా చాణక్య నీతిలో ప్రతి బంధువు మీ శ్రేయోభిలాషి కాదని స్పష్టంగా చెప్పబడింది. చాలా సార్లు మీ కుటుంబంలో లేదా బంధువులలో మీ రహస్యాలను ఇతరులకు వెల్లడించడం ద్వారా మిమ్మల్ని అవమానించేలా చేయడం లేదా మీకు హాని కలిగించాలని కోరుకుంటారు. కనుక ప్రతి విషయానికి భావోద్వేగానికి గురై బంధువులతో ప్రతిదీ పంచుకోవద్దు అని చెప్పాడు.
శత్రువు ముందు మౌనంగా ఉండాలి. తన శత్రువు లేదా పోటీదారుడి ముందు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తన వ్యక్తిగత విషయాలు, బలహీనతలు లేదా ప్రణాళికలను తన శత్రువుతో ఎప్పుడూ పంచుకోకూడదు. మీ శత్రువు ఈ విషయాలను మీకు హాని కలిగించడానికి ఆయుధంగా ఉపయోగిస్తాడు. కనుక శత్రువు ముందు మౌనంగా ఉండటమే అతిపెద్ద రక్షణ.
భార్యాభర్తల మధ్య నమ్మకం అత్యంత బలమైనది ఆచార్య చాణక్యుడు కూడా ఒక వ్యక్తి తన మనసులోని ప్రతి విషయాన్ని పంచుకోగల ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామి అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం, పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది. కనుక భార్యాభర్తలు ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది. జీవితంలో సమతుల్యతను కాపాడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








