Viral News: నా లడ్డు నాకు కావాలంతే.. సీఎం హెల్ప్‌లైన్‌కి అధికారులపై ఫిర్యాదు
దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వీధి వీధిలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి.. దేశ స్వాతంత్యం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అయితే ఒక గ్రామంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తమకు ఒక లడ్డునే పంచారని.. ఎప్పుడూ రెండు లడ్డూలను ఇచ్చేవారని ఇలా చేయడం వలన తనకు చాలా నిరుత్సాహం కలిగిందని ఏకంగా ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఈ వింత ఫిర్యాదు మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌లో దాఖలైన బహుళ ఫిర్యాదుల లిస్టు లో ఒక వింత కేసు బయటపడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు లడ్డూలకు బదులుగా ఒక లడ్డూ మాత్రమే ఇచ్చారని ఇది తనకు చాలా నిరాశ కలిగించిందని ఆ వ్యక్తి చెప్పాడు. నౌధా గ్రామంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సాంప్రదాయం ప్రకారం రెండు లడ్డూలను పంచేవారు అని.. అయితే అందుకు విరుద్ధంగా ఒకే ఒక్క లడ్డూను ఇచ్చారని.. ఇది తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని కమలేష్ కుష్వాహా అనే వ్యక్తి తన బాధను ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. కమలేష్ తమ గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై ఫిర్యాదు దాఖలు చేశాడు.
ఈ ఫిర్యాదు ఒక వింత చర్యగా కనిపించినప్పటికీ.. ఈ ఫిర్యాదు పంచాయతీ సిబ్బందిని ఇబ్బంది పెట్టింది. పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో పంచాయితీ సిబ్బంది మార్కెట్ నుంచి ఒక కిలో లడ్డూలను కొనుగోలు చేసి క్షమాపణ, సద్భావన చిహ్నంగా ఖుష్వాహాకు అందించారు. తద్వారా ఫిర్యాదు పరిష్కరించబడింది.
గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆచారాల ప్రకారం జరిగాయి. జెండా ఎగురవేసి.. జాతీయ గీతం ఆలపించిన తర్వాత లడ్డూలు పంపిణీ చేశారు. అయితే ఒకొక్క వ్యక్తికి రెండు లడ్డూలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్క లడ్డునే పంపిణీ చేశారు. దీంతో కుష్వాహా అనే గ్రామస్తులు ఒక లడ్డూని తీసుకొని మరొక లడ్డూ అడిగాడు. ఇవ్వడనికి అధికార సిబ్బంది నిరాకరించడంతో.. అతను CM హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పరిష్కరం కోసం అదనంగా మరో కిలో లడ్డును పంపించి అందరికీ అదనంగా మరొక లడ్డుని అందేలా చేశారు.
నివేదిక ప్రకారం కుష్వాహా ఇప్పటివరకు సీఎం హెల్ప్‌లైన్ ద్వారా 107 ఫిర్యాదులు చేశారు. “కుష్వాహాకు ఇలాంటి పనులు చేయడం అలవాటు. ఆయన ఇప్పటివరకు సీఎం హెల్ప్‌లైన్‌లో వివిధ సమస్యలపై 107 ఫిర్యాదులు చేశారు” అని పంచాయతీ కార్యదర్శి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




