AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Amavasya: రేపే శని అమావాస్య.. శని దోష నివారణకు చేయాల్సిన దానాలు, పూజా విధానం ఏమిటంటే..

పంచాంగం ప్రకారం ప్రతి నెలా అమావాస్య తిథి వస్తుంది. ఈ అమావాస్య శనివారం రోజున వచ్చినప్పుడు దానిని 'శని అమావాస్య' లేదా 'శనీశ్చర్య అమావాస్య' అని పిలుస్తారు. ఈ తిథి ప్రత్యేకంగా శనీశ్వరుడికి అంకితం చేస్తారు. నమ్మకం ప్రకారం ఈ రోజున స్నానం, దానం, పూజలు చేయడం వల్ల శనీశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Shani Amavasya: రేపే శని అమావాస్య.. శని దోష నివారణకు చేయాల్సిన దానాలు, పూజా విధానం ఏమిటంటే..
Shani Amavasya 2025
Surya Kala
|

Updated on: Aug 22, 2025 | 9:28 AM

Share

హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథిని పితృ తర్పణం, స్నాన దానధర్మాలు, పూజలకు శుభప్రదంగా భావిస్తారు. వీటిలో శనివారం నాడు అమావాస్య వస్తే, దానిని శనీశ్చర్య అమావాస్య అంటారు. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం, శని దేవుడిని పూజించడం వల్ల అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం శనీశ్చర్య అమావాస్య పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషాన్ని వదిలించుకోవడానికి ఉత్తమ అవకాశంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ప్రాముఖ్యత, శుభ సమయం, ఆరాధన పద్ధతి గురించి తెలుసుకుందాం.

శ్రావణ మాసం శని అమావాస్య ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శని అమావాస్య తిథి ఆగస్టు 22 శుక్రవారం ఉదయం 11:55 గంటలకు ప్రారంభమై ఆగస్టు 23 శనివారం ఉదయం 11:35 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, శ్రావణ అమావాస్య ఆగస్టు 23న జరుపుకుంటారు.

ఈ శుభ సమయంలో స్నాన దానం చేయండి అమావాస్య తిథి నాడు నదీ స్నానం చేసి దానం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం సూర్యోదయానికి ముందు. కనుక ఈ రోజు స్నానం చేసి దానం చేయడానికి శుభ సమయం ఉదయం 4:34 నుంచి ప్రారంభమై 5:22 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

శని అమావాస్య నాడు స్నానం, దానం ప్రాముఖ్యత పవిత్ర నదులలో స్నానం.. ఈ రోజున గంగా, యమునా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే.. ఇంట్లో స్నానపు నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేయడం శుభప్రదం.

దానం ప్రాముఖ్యత: ఈ రోజున దానం చేయడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని మహాదశ, ఏలి నాటి శని లేదా ధైయా అశుభ ప్రభావాలను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

శని అమావాస్య నాడు దానం చేయాల్సిన వస్తువులు నల్ల నువ్వులు, నల్ల దుప్పటి లేదా నల్ల బట్టలు, ఆవాల నూనె, ఇనుప వస్తువులు, మినపప్పు, బూట్లు , చెప్పులు పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి.

శనివారం అమావాస్య నాడు పూజా విధి శని అమావాస్య రోజున శనిదేవుడిని సరైన ఆచారాలతో పూజించాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. శనిదేవుని విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని పూజించండి. శనిదేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించండి. ‘ఓం శం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శని చాలీసా, శని స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజున రావి చెట్టు కింద ఆవ నూనె దీపాన్ని వెలిగించి దానిని 7 లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయండి.

అమావాస్య రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూదంటే

  1. ఈ రోజు మాంసం, మద్యం తామసిక ఆహారం తినకూడదు.
  2. ఎవరికీ అబద్ధం చెప్పడం లేదా వేధించడం మానుకోండి.
  3. శనిదేవుడిని సంతోషపెట్టడానికి పేదలకు , నిస్సహాయులకు సహాయం చేయండి.
  4. ఈ రోజున కొత్త పనులు ఏవీ ప్రారంభించవద్దు ముఖ్యంగా మీ జాతకంలో శని స్థానం అశుభంగా ఉంటే కొత్త పనులు చేయవద్దు.

శని అమావాస్య ప్రాముఖ్యత

ఈ రోజున శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకులకు తర్పణం, శ్రద్ధారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం, ఏలి నాటి శని, శని ధైయతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. కాలసర్ప దోషం, గ్రహ బాధ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఏమైందో
రెస్టారెంట్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ మహిళకు ఏమైందో
రోజూ పాలలో నానబెట్టి పరగడుపున రెండే రెండు తిన్నారనుకోండి.!
రోజూ పాలలో నానబెట్టి పరగడుపున రెండే రెండు తిన్నారనుకోండి.!
రైల్వే వెయిటింగ్ లిస్ట్ సీక్రెట్స్.. ఏ టికెట్ త్వరగా కన్ఫర్మ్..
రైల్వే వెయిటింగ్ లిస్ట్ సీక్రెట్స్.. ఏ టికెట్ త్వరగా కన్ఫర్మ్..
ఇలాంటి దృశ్యం చాలా అరుదు.. 3 పాములు ఒక్కచోట చేరి..
ఇలాంటి దృశ్యం చాలా అరుదు.. 3 పాములు ఒక్కచోట చేరి..
మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.!
మటన్ లివర్ మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.!
తాజ్ మహల్ కంటే రెండింతలు ఖరీదైన సింహాసనం..సంపద, వజ్రాలు, వైభవం
తాజ్ మహల్ కంటే రెండింతలు ఖరీదైన సింహాసనం..సంపద, వజ్రాలు, వైభవం
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌లో పెద్ద పొరపాటు
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌లో పెద్ద పొరపాటు
ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.!
ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.!
'పెద్ది'లో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా?
'పెద్ది'లో శివన్న రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా?
భారత్ కంటే ముందే చైనా ఎలా సాధించింది “లీక్-ప్రూఫ్” పరీక్ష వ్యవస్థ
భారత్ కంటే ముందే చైనా ఎలా సాధించింది “లీక్-ప్రూఫ్” పరీక్ష వ్యవస్థ