AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: జైసల్మేర్‌లో జురాసిక్ యుగం నాటి ఎగిరే డైనోసార్ శిలాజం లభ్యం.. రంగంలోకి GSI

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డైనోసార్ యుగం నాటి శిలాజాలు కనుగొనబడ్డాయి. ఇక్కడ ఒక చెరువు తవ్వకాలు జరుగుతుండగా.. పెద్ద ఎముక ఆకారంలో ఉన్న నిర్మాణం , కొన్ని శిలాజ వంటి అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది ఎగిరే డైనోసార్ అస్థిపంజరం కావచ్చునని నిపుణులు అంటున్నారు.

Rajasthan: జైసల్మేర్‌లో జురాసిక్ యుగం నాటి ఎగిరే డైనోసార్ శిలాజం లభ్యం.. రంగంలోకి GSI
Dinosaur Fossils In Rajasth
Surya Kala
|

Updated on: Aug 22, 2025 | 10:33 AM

Share

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక గ్రామంలోని చెరువు తవ్వకాలను జరుపుతుండగా.. శాస్త్రవేత్తలు డైనోసార్ యుగం నాటి శిలాజాలను కనుగొన్నారు. వీటి డైనోసార్ల అస్థిపంజరాలుగా పరిగణిస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన శాస్త్రీయ నిర్ధారణ ఇంకా జరగలేదు. ఇప్పుడు GIS బృందం దీనిని శాస్త్రీయంగా పరిశీలిస్తుంది. ఫతేఘర్ సబ్ డివిజన్‌లోని మేఘ గ్రామంలో ఒక చెరువును తవ్వుతున్నప్పుడు, ప్రజలు ఈ ప్రత్యేకమైన రాతి నిర్మాణాలను, పెద్ద అస్థిపంజరం లాంటి శిలాజాలాన్ని కనుగొన్నారు. ఈ ముక్కలలో కొన్ని శిలాజ కలపలాగా కనిపిస్తున్నాయి. మిగిలినవి ఎముకలలాగా కనిపిస్తాయి. పశ్చిమ రాజస్థాన్‌లో శిలాజ కలప అసాధారణం కాదని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఎముక లాంటి నిర్మాణాల ఉనికి ఈ ఆవిష్కరణను ప్రత్యేకంగా చేస్తుంది.

ఫతేగఢ్ సబ్ డివిజన్ అధికారి , తహసీల్దార్ బుధవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి అవశేషాలను పరిశీలించారు. ఫతేగఢ్ సబ్ డివిజన్ అధికారి భరత్రాజ్ గుర్జార్ గురువారం మాట్లాడుతూ – మేము ఉన్నతాధికారులకు సమాచారం అందించాము.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GIS) శాస్త్రవేత్తలు దర్యాప్తు కోసం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత మాత్రమే శిలాజం వయస్సు , రకాన్ని నిర్ధారించగలమని చెప్పారు.

పురావస్తు శాస్త్రవేత్త పార్థ్ జగని మాట్లాడుతూ ఇక్కడ లభించిన కొన్ని నిర్మాణాలు రాతి చెక్కలా కనిపిస్తున్నాయి. అయితే అస్థిపంజరంలా కనిపించే పెద్ద నిర్మాణం కూడా ఉంది. వీటన్నింటి కలయిక ఈ అవశేషాలు మిలియన్ల సంవత్సరాల నాటివి కావచ్చు, బహుశా డైనోసార్ యుగం నాటివి కావచ్చునని చెబుతున్నారు. అయితే శాస్త్రీయ పరీక్షలకు ముందు వాటి గురించి ఎటువంటి తీర్మానాలు చేయవద్దని నిపుణులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

100 సంవత్సరాల వయస్సు కూడా ఉండవచ్చు

ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ మీనా మాట్లాడుతూ ఈ అవశేషాలు లోతైన తవ్వకాల్లో బయల్పడ లేదు. ఉపరితలంపైనే కనిపించాయి. కనుక ఇవి అతి పురాతనమైనవి కావు.. 50 నుంచి 100 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్బన్ డేటింగ్, ఇతర శాస్త్రీయ విశ్లేషణ పద్ధతులు మాత్రమే వాటి ఖచ్చితమైన వయస్సును నిర్ణయించగలవని చెప్పారు. అనుమానిత శిలాజాలు చెరువు సమీపంలోని రాతి శిఖరాలలో నిక్షిప్తం చేయబడి కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది తరచుగా పురాతన అవక్షేపణ నిక్షేపాలతో ముడిపడి ఉంటుంది. థార్ ఎడారిలో శిలాజ కలప కనుగొనబడినట్లు గతంలో నివేదికలు ఉన్నాయి, అయితే అస్థిపంజరం వంటి నిర్మాణంతో కలిపి బయపడడం ఈ సారి ప్రత్యేకం ఆసక్తిని కలిగిస్తుందని చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

ఈ ఆవిష్కరణ తర్వాత భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అవశేషాల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ ఈ ప్రాంతం చరిత్రపూర్వ గతానికి కొత్త ఆధారాలను అందించగలదనే ఊహాగానాలకు దారితీసింది. డైనోసార్ యుగం నాటి.. శిలాజాలు , పాదముద్రలు జైసల్మేర్ జిల్లాలో గతంలో కూడా కనుగొనబడ్డాయి. ఈ తాజా ఆవిష్కరణ నిరూపితమైతే.. దేశంలో పురాజీవ శాస్త్ర పరిశోధన కేంద్రంగా రాజస్థాన్ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్