AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు

ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుండి వీధి కుక్కలను తరలింపు, వాటిని షెల్టర్ హోమ్‌లలో శాశ్వతంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులో కొన్ని సవరణలు చేస్తున్నామని కోర్టు తెలిపింది. జాతీయ విధానాన్ని చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బాధ్యులుగా చేర్చుతున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. ఈ మేరకు అయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.

వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు
Supreme Court On Stray Dogs
Balaraju Goud
|

Updated on: Aug 22, 2025 | 11:08 AM

Share

ఢిల్లీ-ఎన్‌సిఆర్ వీధుల్లో వీధికుక్కలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆగస్టు 11న ఈ కేసును విచారించిన భారత అత్యున్నత న్యాయస్థానం, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వీధుల్లోని వీధికుక్కలను శాశ్వతంగా డాగ్ షెల్టర్లకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై సమీక్ష పిటిషన్ దాఖలైంది. ఈ విషయంపై శుక్రవారం (ఆగస్టు 22) తీర్పు ఇస్తూ, దేశరాజధానిలోని అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ తర్వాత వదిలివేయాలని కోర్టు సూచించింది. దీంతో పాటు, హింసాత్మక కుక్కలను వదలకూడదని కోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుండి వీధి కుక్కలను తొలగించి, వాటిని షెల్టర్ హోమ్‌లలో శాశ్వతంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులో కొన్ని సవరణలు చేస్తున్నామని కోర్టు తెలిపింది. జాతీయ విధానాన్ని చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పార్టీలుగా చేర్చుకున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు.

సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను సవరించి, కుక్కలను వదలడంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. రేబిస్ మరియు ప్రమాదకరమైన కుక్కలను వదలకూడదని కోర్టు పేర్కొంది. పట్టుకున్న కుక్కలకు టీకాలు వేసి, తరువాత వదలాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటు, అనారోగ్యంతో ఉన్న, దూకుడుగా ఉండే కుక్కలను షెల్టర్ హోమ్‌లలో మాత్రమే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టకుండా ప్రత్యేక ప్రాంతంలో ఒక నిర్ణీత స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది.

బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కల పట్టుకునే బృందం పనిని అడ్డుకునే వ్యక్తికి రూ.25,000 జరిమానా, ఒక స్వచ్ఛంద సంస్థకు రూ.2 లక్షల జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఫిర్యాదులు నమోదు చేయడానికి హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని కోర్టు తెలిపింది. జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..