శనీ అమావాస్య : ఈ రాశుల వారు జర జాగ్రత్త!
శని అమావాస్య వచ్చేస్తుంది. ఆగస్టు 23న శనీ అమావాస్య . దీనికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు పండితులు. ఈరోజు చాలా మంది తమ పూర్వీకులకు పిండప్రదానంలాంటివి చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. వారు ఎవరో చూద్దాం.
Updated on: Aug 22, 2025 | 4:32 PM

2025 సంవత్సరంలో ఆగస్టు 22న మొదలై, ఆగస్టు 23న ముగుస్తుంది. ఈ తిథిని శని కాబట్టి దీనిని శని అమావాస్య అంటారంట. అయితే ఈ అమావాస్య రోజున దేవుడిని పూజించడమే కాకుండా పూర్వీకులకు తర్పణం చేయడం చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజున కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : శనీ అమావాస్య రోజున మేషరాశి వారు దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ, తీసకోవడం అస్సలే చేయకూడదంట. ఈ రోజు ఏలినాటి శనితో బాధపడే వారు తమ కులదైవాన్ని ఆరాధించడం చాలా మంచిది.

వృషభ రాశి : ఈ అమావాస్య రోజున వృషభ వారు కొత్త బట్టలు కొనడం లేదా కొత్త వాహనాలు కొనడం అస్సలే మంచిదికాదంట. ఈరోజున ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి. అలాగే దూరప్రయాణాలు వీలైనంత వరకు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు పండితులు.

వృశ్చిక రాశి : వృశ్చికరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో మరీ జాగ్రత్తగాఉండాలి. ఖర్చులు పెరుగాయి. ఇంట్లో కలహాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు చాలా వరకు మౌనం పాటించడమే ఉత్తమం.

వైవాహిక జీవితంలో కూడా కలహాలు జరిగే అవకాశం ఉన్నదంట. అలాగే వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టడం చేయకూడదు, స్థిరాస్థి కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి చేయకూడదంట.



