Chanakya Niti: నూతన సంవత్సరంలో ఈ నాలుగు నిర్ణయాలు తీసుకోండి.. ఇక జీవితంలో ఓటమి అనేదే ఎరుగరు..!

Chanakya Niti: 2021 సంవత్సరం మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లో చేరిపోనుంది. నూతన సంవత్సరం 2022 రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది కొత్త సంవత్సరం

Chanakya Niti: నూతన సంవత్సరంలో ఈ నాలుగు నిర్ణయాలు తీసుకోండి.. ఇక జీవితంలో ఓటమి అనేదే ఎరుగరు..!
Chanakya
Follow us

|

Updated on: Dec 11, 2021 | 8:15 AM

Chanakya Niti: 2021 సంవత్సరం మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లో చేరిపోనుంది. నూతన సంవత్సరం 2022 రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభిస్తుంటారు. అయితే, వ్యక్తులు తమ జీవితంలో రాణించాలంటే, ఉన్నత శిఖరాలు చేరాలంటే ఆచార్య చాణక్య పలు నిర్ణయాల గురించి తాను రాసిన గ్రంధాల్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ఆ నిర్ణయాలు తీసుకుని, ఆచరించడం ద్వారా విజయమే తప్ప అపజయం ఎరుగని విధంగా ముందుకు సాగవచ్చని ఆచార్య చాణక్య అభిప్రాయం. మరి చాణక్యుడు తెలిపిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కోపం, అహంకారాన్ని త్యజించాలి: ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తికి కోపం, అహం అనేవి ప్రధాన శత్రువులు. కోపం.. వ్యక్తి మనస్సాక్షిని అదుపు చేస్తుంంది. అహం.. ఒక వ్యక్తి మంచి, చెడు మధ్య తేడా గ్రహించే సామర్థ్యాన్ని నశింపజేస్తుంది. తద్వారా జీవితాంతం మీరు ఎంత శ్రమించినప్పటికీ నిష్ప్రయోజనమే అవుతుంది. అందుకే.. ఈసారి నూతన సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ రెండు ప్రధాన శత్రువులను త్యజిస్తామని డిసైడ్ అవ్వండి.

విమర్శలను పట్టించుకోవద్దు: ఒక వ్యక్తి ముందుకు సాగినప్పుడు, ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టినప్పుడు విమర్శలకు గురవుతుంటారు. అయితే, మీరు చేస్తున్నది సరైనదని మీకు ఖచ్చితంగా అనిపిస్తే ఆ విమర్శల గురించి ఎప్పుడూ చింతించకండి. కాలం గడిచే కొద్దీ విమర్శలు కూడా ప్రశంసలుగా మారుతాయి. కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టి మీ పనిని కొనసాగించండి.

తప్పును పునరావృతం చేయవద్దు: తప్పులను మనుషులే చేస్తారు. తప్పు చేయడం తప్పు కాదు. అది వ్యక్తికి అనుభవాన్ని ఇస్తుంది. కానీ తప్పును తప్పు అని తెలిసి కూడా చేయడం తప్పు. అందులోనూ ఆ తప్పును పునరావృతం చేయడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది. తప్పులను పునరావృతం చేస్తే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. కాబట్టి మొదటిసారి మీరు చేసిన తప్పు నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

శ్రమకు భయపడవద్దు: కష్టపడకుండా ఎవరూ విజయం సాధించలేరు. కాబట్టి శ్రమకు భయపడకండి. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా దాని కోసం వీలైనంత కష్టపడండి. కష్టపడి లక్ష్యాన్ని సాధించినప్పుడు దానికి మించిన ఆనందం మరొకటి ఉండదనే విషయాన్ని గ్రహించాలి.

Also read:

Indian Railways: భారతీయ రైల్వే వినూత్న ప్రయోగం.. రైళ్లలో రైలు హోస్టెస్‌లను నియమించాలని నిర్ణయం..

SS Rajamouli: ఆ స్థాయిలో సినిమాలు తీయడం నాకు చాలా కష్టం.. ఆర్ఆర్ఆర్ పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..

PM Modi: యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్న మోడీ.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అంటూ ట్వీట్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు