Chanakya Niti: ఈ మూడు విషయాలు పాటించకపోతే.. మీరు ఆర్ధికంగా నష్టపోయినట్లే.!
Chanakya Niti: జోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతీది దేనికో దానికి అనుసంధానమై ఉంటుంది. శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను సూచిస్తుంటాయి…
జోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతీది దేనికో దానికి అనుసంధానమై ఉంటుంది. శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను సూచిస్తుంటాయి. తద్వారా ప్రతీ వ్యక్తి ఆయా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆచార్య చాణక్యుడు ప్రజా సంక్షేమం గురించి అనేక విషయాలు చెప్పాడు. ఆర్ధిక సంక్షోభం లేదా మరేదైనా సమస్యను ముందుగానే గుర్తించవచ్చునని.. వాటిని సకాలంలో అర్ధం చేసుకుంటే.. తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.
ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త మాత్రమే కాదు.. సామాజిక విషయాలపై కూడా అవగాహన ఉన్న వ్యక్తి. అతడు చెప్పిన మాటలు నేటికాలంలో చాలావరకు నిజమని రుజువు చేస్తాయి. ప్రజలు పాటించాల్సిన విషయాలు, విధివిధానాలపై ఆచార్య చాణక్యుడు.. చాణక్య నీతిలో వివరించాడు. అవి పాటించడానికి కఠినంగా ఉన్నా.. మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తాయి. అలాగే రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి ఆచార్య చాణక్యుడు హెచ్చరించి ఇచ్చిన సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. తులసి మొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో గ్రంధాలలో ప్రస్తావించారు. దీనిని దేవతల మొక్కగా పరిగణిస్తారు. మరణానికి ముందు ఒక వ్యక్తికి తులసి తీర్థం పోస్తారు. అంటే ఆ వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడని నమ్మకం. అంతటి మహిమ కలిగిన తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే.. దాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలని ఆచార్య చాణక్య చెప్పాడు. ఆ తులసి మొక్క ఎండిపోకూడదు. ఒకవేళ అది ఎండినట్లయితే.. రాబోయే ఆర్ధిక సంక్షోభానికి సంకేతమని అన్నాడు.
2. మీ ఇంట్లో గాజు పదేపదే పగిలిపోతుంటే, అది రాబోయే ఇబ్బందులకు సంకేతం అని అర్థం చేసుకోండి. తరచుగా గాజు పగిలిపోవడం మంచి సంకేతం కాదు. ఒకవేళ గాజు పగిలితే.. వెంటనే దాన్ని బయట పారేయండి. లేదంటే ప్రతికూలత మరింత పెరుగుతుంది.
3. పెద్దలను అవమానించిన ఇంట్లో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. సంతోషం, శాంతి కూడా దూరమవుతాయి. కాబట్టి, మీ ఇంట్లో ఉన్నవారు తెలిసి లేదా తెలియకుండా పెద్దలను అవమానిస్తే, వారికి వివరంగా చెప్పండి. ఇంట్లో ఎలప్పుడూ సంతోషం ఉండాలంటే.. పెద్దలను గౌరవించండి.. వారి నుంచి ఆశీర్వాదాలు పొందండి.