Chanakya Niti: ప్రజలు సంతోషంగా ఉండడానికి దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలో చెప్పిన చాణక్య

Chanakya Niti: చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి  చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షులు. చాణుక్యుడిని..

Chanakya Niti: ప్రజలు సంతోషంగా ఉండడానికి దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలో చెప్పిన చాణక్య
Chanakya Niti
Follow us

|

Updated on: Aug 20, 2021 | 6:45 AM

Chanakya Niti: చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి  చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షులు. చాణుక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడనే పేర్లతో కూడా పిలుస్తారు.  చాణక్యుడు అర్దశాస్త్రాన్ని రచించారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా మంచి నిపుణులు. చాణుక్యుడు సమాజంలో జరిగే మంచి చెడులను వివరిస్తూ.. దానికి పాలకులు, ప్రజలు తీసుకోవాలిన జాగ్రత్తలను తెలుపుతూ.. నవ సమాజం నిర్మాణం కోసం చేయాల్సిన పనులను తెలిపారు. ఈరోజు దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలి..  ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలను అందించాలని చాణక్యుడు సూచించారు.

* ప్రజల సుఖమే పాలకులకు సుఖము. ప్రజల హితమే పాలకులకు మంచి. *పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రదేశములలో గృహములను నిర్మించాలి. ఆ గ్రామములలో తటాకములు నిర్మించాలి. దీనివలన నీటి కొరత ఉండదు . రెండవ పంటకు కూడా ఈ తటాకాలు ఉపయోగపడతాయి. * ఆనకట్టల నిర్మాణం జరపాలి. నీటిని వృధా కానీయరాదు. ప్రతి చుక్కా విలువైనదే. *వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలి. కాలువలు, చేరువుల ద్వారా వ్యవసాయానికి అనూకూల పరిస్థితులు కల్పించాలి. * పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయలి. దీనివలన పశువులకు గ్రాసం లభించి పాడి అభివృద్ధి చెందుతుంది. *వ్యాపర మార్గాలు ఏర్పాటు జరపాలి. వాణిజ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన దేశ ఆదాయం పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు. * విదేశీ వ్యవహారాలలోనూ, దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగిఉండాలి. లేదంటే ఇతరులు చొరబాట్లకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. * దేశక్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. * దేశానికి ఆదాయాన్ని ఇచ్చేదే అయినా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదిలేయాలి. * ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు పాలకుడు అనుక్షణం ప్రజల యోగక్షేమాలు విచారించి తగిన రక్షణ కల్పించాలి.

Also Read:  సమాజ్‌వాదీ నేతపై దేశద్రోహం కేసు పెడితే… ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడిన ఒవైసీ

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.