AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలం.. స్థిరాస్తి అమ్మకాలలో లాభాలు

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలం.. స్థిరాస్తి అమ్మకాలలో లాభాలు
Horoscope Today
uppula Raju
|

Updated on: Aug 20, 2021 | 5:53 AM

Share

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. శుక్రవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి: ఈ రోజును ఆశాజనకంగా ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ భవిష్యత్తు కోసం వినూత్నమైన ఆలోచనలు చేయండి. ఆర్థికపరమైన విషయాలలో కోర్టు కేసు మీకు అనుకూలంగా వస్తుంది. మీకు ఎంతో లాభం. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కొంతమందికి ఆఫీస్ టూర్స్. సరైన ప్రణాళికతో ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభ రాశి: ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. కుటుంబ సభ్యులకు ఇంటి పనులలో సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకంలో అనుకోని లాభాలు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులలో లాభాలు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది.

మిధున రాశి: ఈరోజు పనులు అనుకున్నంతగా సాగవు మీ చేతికందినదే మీది అందే వరకు ఎదురు చూడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తటపటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ తోడబుట్టిన వారికి డబ్బు సహాయం చేస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఒకే రకమైన జీవితం కాకుండా వినూత్నంగా ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి: మీ కమ్యూనికేషన్ తో ఇతరులను మెప్పిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. గుండెజబ్బుతో బాధపడేవారు కాఫీని వదిలివేయండి. పాతబాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.

సింహరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది. అనవసర దుబారా ఖర్చులను ఒక కంట గమనించండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. మీరే కరెక్టు అని కుటుంబ సభ్యులతో మొండి వాదనలకు దిగకండి. దాని వలన వారు హర్ట్ అవుతారు లేనిపోని ఇబ్బందులు

కన్యారాశి: దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత, ఎంతో ధైర్యం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలను తెస్తాయి. జాగ్రత్త వహించండి. సమస్యల విషయంలో ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన మీ శరీరం అందంగా తయారవుతుంది.

తులారాశి: కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. విదేశీ ప్రయాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆదాయం బాగున్నా దుబారా ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది కలుగుతోంది అనే విషయాన్ని తెలుసుకుంటారు. అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేస్తున్నారు.

వృశ్చిక రాశి: ఈరోజు అన్ని పనులలో అభివృద్ధి. చాలా అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. ఒడిసి పట్టుకోండి సరైన కమ్యూనికేషన్ విజయానికి సూత్రం. స్థిరాస్తి వ్యాపారం లో లాభాలు. సంఘంలో పేరు ప్రతిష్టలు. ప్రముఖ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు షాపింగ్ చేస్తారు.

ధనుస్సు రాశి: ఈరోజు మీ సహనానికి పరీక్ష. మీ నిరాశావాద ధోరణి వల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. దైవ ప్రార్ధన వల్ల మానసిక బలము మరియు సరైన ఆలోచనలు. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో జరుగుతున్న ఫంక్షన్ వల్ల స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. సరైన ప్రణాళిక లేకుండా పనులను చేస్తూ పోవడం వల్ల సమయం వృధా. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం.

మకర రాశి: వ్యాపారులకు వారి ఊహలు నిజం అవ్వటం వల్ల అధిక లాభాలు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు మరింత లాభాలను తెస్తాయి. ఈ రోజు అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. కుటుంబ సభ్యుల మీద కోప తాపాలు ప్రదర్శించకండి. వారు హర్ట్ అయితే ఇబ్బందులు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే అధిక శ్రమ పడాలి సరైన భోజనం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభరాశి: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఊహలతో బ్రతకకండి. పరిస్థితులతో సర్దుకుపోవాలి. కొంతమంది విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నాలు చేస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. మరింత సంపాదన కోసం నూతన ప్రణాళికలు వేస్తారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో భేదాభిప్రాయాలు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి.

మీన రాశి: ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. అదృష్టం మీ పక్షాన ఉంది. కుటుంబ సభ్యులలో ముఖ్యంగా పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో లాభాలు. ఆఫీస్ పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. అనుకోని అతిథుల రాక వలన ఆనందమూ లాభము. కొంతమంది వ్యక్తులతో గడపటం వల్ల సమయం వృధా అయిందని అనుకొంటారు. విజయం సాధించాలంటే క్రమశిక్షణ అవసరం.