AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? సాధ్యమో.. కాదో తెలుసుకోండి

సనాతన సంప్రదాయంలో తరచుగా తలెత్తె ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. భార్యాభర్తల సంబంధం ఒక జీవితకాలానికే పరిమితమా? లేక అనేక జీవితాలు ఉంటుందా? అనేది. తెలుగులో సాధారణంగా భార్యాభర్తల సంబంధం అంటే ఏడేడు జన్మల సంబంధం అని చెబుతుంటారు. కానీ, అది నిజంగా సాధ్యమేనా? కాదా అనేది ఇప్పుడు ప్రేమానంద్ మహారాజ్ చెప్పిన మాటల్లో తెలుసుకుందాం..

ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? సాధ్యమో.. కాదో తెలుసుకోండి
husband and wife
Rajashekher G
|

Updated on: Jan 19, 2026 | 2:20 PM

Share

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ వద్దకు వచ్చిన ఓ మహిళా భక్తురాలు.. ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండటం సాధ్యమేనా? అని అడిగింది. ఈ ప్రశ్న కేవలం ఆసక్తికరమైనదే కాదు.. లోతైన భావోద్వేగం, మమకారం నిండి ఉన్నది. చాలా మంది భాగస్వాములు వచ్చే జన్మలో కూడా వారే తమకు భార్య లేదా భర్తగా రావాలని కోరుకుంటూ ఉండటం వినే ఉంటాం. కానీ, దీనిపై ప్రేమానంద్ మహారాజ్ సమాధానం ఇప్పుడు చూద్దాం.

కర్మ, విధి మధ్యలో లోతైన సంబంధం

ఒక జన్మలో భార్యాభర్తల కలయిక వారి వ్యక్తిగత కర్మలు, సంచిత కర్మ, విధిపై ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో భార్యా లేదా భర్త అయిన వ్యక్తి తదుపరి జన్మలో అదే రూపంలో లేదా మానవ రూపంలో కూడా జన్మించే అవకాశం ఉండవచ్చు లేకపోవచ్చు. కర్మ నియమం చాలా సూక్ష్మమైనది, లోతైనది.. కేవలం భావోద్వేగాల ద్వారా మార్చబడదని ప్రేమానంద్ మహారాజ్ స్పష్టం చేశారు.

యాధృచ్ఛికం కేవలం దేవుని దయ వల్లేనే సాధ్యం

అయితే, అసాధ్యమని అనిపించే ఈ ప్రశ్న కూడా దేవుని దయ వల్ల సాధ్యం కావచ్చని స్వామిజీ అంటున్నారు. ఒక పురుషుడు లేదా స్త్రీ తనను తాను దేవునికి అంకితం చేసుకుని.. పూర్తి అంకితం భావంతో అదే భాగస్వామి తనతో ఏడు జన్మలపాటు ఉండేలా వరం కోరితే.. దేవుడి అనుగ్రహంతో అది సాధ్యం కాగలదు. విశ్వ సృష్టికర్తకు అసాధ్యం అనేది లేదు అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు.

కర్మ మాత్రమే కాదు.. భక్తి, తపస్సు కూడా నిర్ణయాత్మకం

కర్మ లేదా విధిపై మాత్రమే ఆధారపడటం వల్ల తదుపరి జీవితంలో ఒకే జీవిత భాగస్వామి ఉంటారని హామీ ఇవ్వలేము. దీని కోసం కఠినమైన భక్తి, తపస్సు, దేవుని కోసం ప్రత్యేకమైన ఆరాధన అవసరం. భక్తి జీవితానికి కేంద్రంగా మారినప్పుడు మాత్రమే.. దేవుడు తన అనుగ్రహంలో ప్రత్యేక కృపను ప్రసాదిస్తాడు అని ప్రేమానంద్ మహారాజ్ వివరించి చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు. )

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..