Bhadhrachalam: రామయ్యని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పక్షి.. పర్ణశాలలో ప్రదక్షిణాలు..
దక్షిణ అయోధ్య గా బాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భద్రాద్రి రామయ్యకు భక్తులు తాము మొక్కిన మొక్కులు తీర్చుకుంటారు. అయితే తాజాగా ఓ భక్తుడితో పాటు ఓ పక్షి రామయ్యని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. ఈ పక్షిని తాను అల్లారుముద్దుగా పెంచుకున్నట్లు ఆ భక్తుడు తెలిపాడు.

భద్రాదిలో కొలువైన సీతారాములను మాత్రమే కాదు సమీపంలోని పర్ణశాల ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. అయితే సీతాసమేతంగా కొలువైన రామయ్యని మనుషులు దర్శించుకొని నగలు, నగదు, భూములు వంటి వాటితో పాటు రకరకాల వస్తువులను మొక్కులు చెల్లించుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సన్ బర్డ్ అనే పక్షి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించు కుంది.. నిత్యం రామనామాన్ని స్మరిస్తూ తను అల్లారు ముద్దుగా పెంచుకునే సన్ బర్డ్ అనే పక్షితో పర్ణశాల రామాలయంలో మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తుడు కళింగ రెడ్డిని చూసిన రామభక్తులు ఆశ్చర్యపోయారు.
సీతారాముల వనవాస పంచవటి దృశ్యాల చుట్టూ పలుమార్లు తిరుగుతూ అందరినీ భక్తి పారవశ్యంలో మునిగేలా చేసింది ఆ పక్షి. పక్షి ప్రవర్తనను చూసిన భక్తులు జై శ్రీరాం , జై జై శ్రీరాం అనే భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. భద్రాద్రి రామయ్యతో పాటు రాముడు వనవాసం చేసిన పర్ణశాల ఆలయం, సీతమ్మ కుటీరం చూపిస్తానని మొక్కిన మొక్కులు తీర్చుకునేందుకు తను పెంచుకున్న పక్షిని తీసుకొచ్చినందుకు జన్మ ధన్యమైందని భక్తుడు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








