AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Breaking Ritual: హిందువులు ఎందుకు కొబ్బరికాయ కొడతారు.? దీని ప్రాముఖ్యత తెలుసా.?

హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోను, మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయను భగవంతునికి అర్పించడం చూడవచ్చు. కానీ, ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలామందికి తెలియదు. జ్యోతిష్య పండితులు ఈ ఆచారం వెనుక గురించి ఏం అంటున్నారు.? చూద్దాం.. 

Prudvi Battula
|

Updated on: Jun 20, 2025 | 4:14 PM

Share
హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోను, మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయను భగవంతునికి అర్పించడం చూడవచ్చు. కానీ, ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలామందికి తెలియదు. 

1 / 5
పండితులు ప్రకారం, కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇది జీవనశక్తిని ప్రతిబింబిస్తుంది. ప్లాస్టిక్ వంటి కృత్రిమ వస్తువులలో ఈ ప్రాణశక్తి ఉండదు. అందుకే పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి వస్తువులలో కూడా ఈ ప్రాణశక్తి ఉంటుంది. అందుకే అవి కూడా పూజల్లో వాడతారు.

2 / 5
కొబ్బరికాయ కొట్టడం కోరికలు నెరవేరడం పైనే ఆధారపడి ఉండదు. ఇది భగవంతుని పట్ల నమ్మకం, కృతజ్ఞతను ప్రదర్శించే విధానం. కోరిక నెరవేరాలని మొక్కుకున్న వారు, ముందుగానే కొబ్బరికాయ కొట్టాలి.

3 / 5
దేవునిపై నమ్మకం ఉండి, కోరిక తీరిన తర్వాత మొక్కుకున్న సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడం కృతజ్ఞతా సూచనగా చెప్పుకోవచ్చు. కానీ, కోరిక తీరిన తర్వాతనే కొబ్బరికాయలు కొట్టాలని మొక్కుకోవడం సరైన విధానం కాదు.

4 / 5
దేవునిపై నమ్మకంతో కూడిన భక్తి తో కొబ్బరికాయను కొట్టాలి. అప్పుడు అది నిజమైన పూజగా పరిగణించబడుతుంది. కోరిక నెరవేర్చడం కంటే దేవునిపై నమ్మకం మరియు కృతజ్ఞత అనేది ఎంతో ముఖ్యం అని ఈ వివరణ స్పష్టం చేస్తుంది.

5 / 5