Hyderabad: శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు.. సోమవారం భక్తులకు కూరగాయలు వితరణ
హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణ పురం లోని కుర్తాల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయం లో దేవతలకు, ఆలయ ప్రాంగణమంతా వేలకొలది వివిధ రకాల కూరగాయలతో ఆకుకూరలతో అలంకరణ సేవ జరిగింది. ఉదయం నుండి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలచే శ్రీ లలిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. భక్తులు విశేష హోమాలలో పాల్గొన్నారు.

హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణ పురం లోని కుర్తాల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయం లో దేవతలకు, ఆలయ ప్రాంగణమంతా వేల కొలది వివిధ రకాల కూరగాయలతో ఆకుకూరలతో అలంకరణ సేవ జరిగింది. ఉదయం నుంచి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలందరూ శ్రీ లలిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు విశేష హోమాలలో పాల్గొన్నారు.
ఆలయ సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ, పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్దేశ్వరానందభారతి మహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ దత్తేశ్వరానందభారతి మహా స్వామి వారి ఆశీస్సులతో మందిరములో అన్ని సేవలు వైభవంగా జరిగాయని తెలిపారు.
శ్రావణమాసంలో అమ్మవారికి లక్ష గాజుల పూజసేవ జరుగుతుందని తెలిపారు. అతి శక్తిమంతమైన, మహిమాన్విత మైన వారాహి ప్రత్యంగిరా హోమాలకు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని, ప్రతినిత్యం దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారని, హోమాలు చేసుకుని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను పొందుతున్నారని తెలిపారు. కూరగాయలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకి వితరణ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విఠల్ శర్మ, సువర్ణలత, అరుణ, హేమంత్, విశ్వనాథ్,, సాయి, నిఖిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




