- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips: Why should we not keep Nataraja statue at home know Hindu Mythology Explained
Nataraja Idol: అందం కోసం అంటూ నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా.. ఎన్ని సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
సృష్టి లయకారుడు శివుడి స్వరూపం నటరాజ స్వామి. అంటే విశ్వ నర్తకి. నటరాజు రూపం విశ్వాన్ని సృష్టించడం, సంరక్షించడం, నాశనం చేయడం అనే మూడు శక్తులను సూచిస్తుంది. శివుడు తన నృత్యం ద్వారా విశ్వాన్ని నడిపిస్తాడు. అయితే శివ స్వరూపం అయిన నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ రోజు శివుని ఉగ్ర రూపం అయిన నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం నిషేధించబడింది. అయితే ఇంట్లో ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం.
Updated on: Jul 21, 2025 | 5:18 PM

దాదాపు ప్రతి హిందువు ఇంట్లో పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో లేదా ఇతర పూజ్యనీయ ప్రాంతాల్లో శివుని విగ్రహం లేదా చిత్రం ఉంటుంది. అదే సమయంలో కొంతమంది తమ ఇంట్లో శివలింగాన్ని కూడా ఉంచుకుంటారు. అయితే శివ స్వరూపం అని నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం మాత్రం శాస్త్ర ప్రకారం నిషేధం. ఎందుకు నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదో తెలుసుకుందాం?

నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభమా లేక అశుభమా అనే దానిపై భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి , అశాంతి వస్తుందని చెబుతారు. మరికొందరు దీనిని కళ, సృజనాత్మకతకు చిహ్నంగా భావించి శుభప్రదంగా భావిస్తారు.

మత విశ్వాసం ప్రకారం నటరాజు శివుని రుద్ర రూపం అంటే విధ్వంసక రూపం. అలాగే.. నటరాజ విగ్రహాన్ని కోపానికి చిహ్నంగా కూడా భావిస్తారు. అందువల్ల ఇంట్లో నటరాజ విగ్రహాన్ని ఉంచడం నిషేధించబడింది. ఈ కారణంగా.. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు.

నటరాజు అనేది శివుని రూపం. ఇది తాండవ నృత్యం చేస్తున్నట్లు ఉంటుంది. ఇది విధ్వంసక రూపం. కనుక దీనిని ఇంట్లో ఉంచడం సరైనది కాదు. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ పురోగతి ఆగిపోతుందని, ఆ వ్యక్తి ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం నటరాజు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబ వాతావరణం చెడిపోతుంది. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరగవచ్చు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం నటరాజు విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. అయితే ఇష్టం అని నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే దుష్ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇతర నమ్మకాల ప్రకారం నటరాజ విగ్రహం ఇంట్లో అశాంతిని, ప్రతికూల శక్తిని తీసుకుని వస్తుంది. అంతేకాదు నటరాజ విగ్రహం కుటుంబ సభ్యులలో అభద్రతా భావాన్ని, భయాన్ని కలిగిస్తుంది. కనుక నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అయితే ఆధ్యాత్మికతకు కళకు నెలవు అయిన కళా ప్రాంగణంలో మాత్రం పెట్టుకోవచ్చు.
