AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్‌

కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్‌

Phani CH
|

Updated on: Jul 21, 2025 | 4:41 PM

Share

పరమేశ్వరుడు స్వయంభువుగా భువిపై వెలసిన క్షేత్రమే చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని వెల్లీశ్వరర్‌ ఆలయం. లయ కారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరుని కోసం శుక్రాచార్యుడు తపస్సు చేసిన పవిత్రపుణ్యక్షేత్రం అది. పార్వతి కామేశ్వరి అమ్మన్‌గా పరమేశ్వరుని పక్కన వెలిసింది.

ఈ ఆలయ సందర్బనకు ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కంటి చూపు మందగించిన వారు ప్రత్యేకంగా వస్తుంటారు. తమ కంటి చూపును మెరుగుపరచాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తారు. ఈశ్వరుడి కరుణతో తమ కంటి చూపు మెరుగవుతుందని నమ్ముతారు. అయితే కంటి చూపు మందగించటానికి పోష‌కాహార లోప‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ంటారు వైద్యులు. ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా కంటి స‌మ‌స్య‌లు తలెత్తే అవకాశం ఉంది. అయితే కంటి స‌మ‌స్య‌లు సాధార‌ణంగా ఎవ‌రికైనా వస్తుంటాయనీ త‌ర‌చూ క‌ళ్లు నొప్పిగా అనిపిస్తున్నా లేదా త‌ల‌నొప్పి త‌ర‌చూ వ‌స్తున్నా.. కంటి స‌మ‌స్య‌లు ఉన్నాయేమోన‌ని అనుమానించాలనీ వైద్యులు అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు సంబంధించి శుక్రుడి స్థలంగా ఈ ఆలయం కీర్తించబడింది. పురాణాల్లో వివరించినట్లుగా తన కంటి చూపును కోల్పోతాడట రాక్షస గురువు శుక్రాచార్యుడు. దీంతో ఈ స్థలంలో శివుడిని స్తుతిస్తూ ఘోర తపస్సు చేసాడట. అనంతరం కోల్పోయిన కంటి చూపు తిరిగొచ్చిందని కథలుగా చెబుతారు. ఈ అతి పురాతన ఆలయంలో కొలువైన శివుడిని దర్శిస్తే కంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్‌ తీసుకున్నారా? ఏం చేయాలంటే

ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్‌! జాలరి దశ తిరిగిపోయింది

వార్నీ.. వాడిన పాత బ్యాగ్ ధర రూ.85 కోట్లా!