మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్ తీసుకున్నారా? ఏం చేయాలంటే
మీ పాన్ కార్డ్ ఎవరైనా వాడినట్టు డౌట్ ఉందా? అయితే వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవరకు ప్రతీచోటా పాన్ కార్డ్ అవసరం అవుతోంది. పాన్ కార్డ్ ఉంటనే సరిపోదు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం కూడా తప్పనిసరే. ఇటీవల ఒకరి పాన్ కార్డ్ ఉపయోగించి మరొకరు లోన్స్ తీసుకోవడం లాంటి మోసాలు బయటపడుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు ఇతరుల పాన్ కార్డ్ డేటా ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. రుణాలు కూడా తీసుకుంటున్నారు. అందుకే పాన్ కార్డ్ హోల్డర్స్ కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇలాంటి మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తరచూ చెక్ చేస్తూ ఉండాలి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను నెలకోసారైనా చెక్ చేయాలి. సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ పేరుతో ఎన్ని లోన్స్, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ రిపోర్ట్‌లో మీరు తీసుకోని లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందేమోనని గుర్తించాలి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో మీ వివరాలతో లాగిన్ కావాలి. అందులో ఫామ్ 26ఏఎస్ చెక్ చేయాలి. మీ పాన్ కార్డుతో జరిపిన లావాదేవీలన్నీ అందులో ఉంటాయి. ఓసారి ఆ వివరాలన్నీ చెక్ చేయాలి. ఒకవేళ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే అలర్ట్ కావాలి. ఉదాహరణకు మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టు ఉంటే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థకు కంప్లైంట్ చేయాలి. లోన్ తీసుకున్నట్టు వివరాలు ఉంటే సదరు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు కంప్లైంట్ ఇవ్వాలి. మీ పాన్ కార్డును ఇతరులు ఉపయోగించినట్టు మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడవద్దు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్! జాలరి దశ తిరిగిపోయింది
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

