AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. వాడిన పాత బ్యాగ్ ధర రూ.85 కోట్లా!

వార్నీ.. వాడిన పాత బ్యాగ్ ధర రూ.85 కోట్లా!

Phani CH
|

Updated on: Jul 21, 2025 | 4:29 PM

Share

ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సంఘటన ఇది. ఐకానిక్ బిర్కిన్ బ్యాగ్‌ల తయారీకి ప్రేరణ అయిన ప్రఖ్యాత నటి, గాయని జేన్ బిర్కిన్ వాడిన తొలి బిర్కిన్ బ్యాగ్ వేలంలో రికార్డు ధర పలికింది. ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ హార్మీస్ సంస్థ.. గతంలో జేన్ కోసం తయారు చేసిన బ్యాగును పారిస్‌లో సోథిబే ఆక్షన్ హౌస్‌లో వేలం వేయగా, అది 8.58 మిలియన్ యూరోలకు అమ్ముడు పోయింది.

అంటే.. మన కరెన్సీలో అక్షరాల 85.75 కోట్లు. ఇంతకీ, దీనిని వేలంలో ఎవరు దక్కించుకున్నారు, ఆ బ్యాగు ఇంత ధర పలకడానికి గల కారణమేంటనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1980లో జేన్ బిర్కిన్ పారిస్ నుంచి లండన్ విమానంలో వెళుతున్నారు. ఆ టైమ్‌లో ఆమె పక్కన సీట్లో.. హార్మీస్ సంస్థ అప్పటి యజమాని జీన్ లూయీస్ డ్యూమస్ కూర్చున్నారు. ఆయనతో మాట్లాడే క్రమంలో.. జేన్ మార్కెట్లోని బ్యాగుల మీద తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది. ఓ బిడ్డకు తల్లిగా, తనకు అవసరమైన వస్తువులన్నీ ఒకే బ్యాగులో పెట్టుకోవటం కుదరటం లేదని, మార్కెట్లో అలాంటి బ్యాగులు కూడా లేవని అంది. ఆమె మాట వినగానే..ఆ బ్యాగుల కంపెనీ ఓనర్ కి మనసులో తళుక్కుమని ఓ ఐడియా వచ్చింది. వెంటనే కాగితంపై జేన్ అవసరాలకు తగిన ఓ బ్యాగ్ మోడల్ పేపర్ మీద గీసి రెడీ చేశాడు. 1984లో అదే డిజైన్‌తోనే ఆ బ్యాగులు మార్కెట్‌కి వచ్చాయి. అయితే, తొలి బ్యాగ్ ను ఆ నటికి అందించారు. అప్పట్లో ఈ మోడల్ బ్యాగ్ బాగా అమ్ముడుపోయింది. ఆ తర్వాత నుంచి జేన్ బిర్కిన్ రోజూ ఆ బ్యాగ్ వాడుతూ కనిపించటం, ఆ బ్యాగ్ మీద ఆమె పేరును సూచించేలా.. J.B అనే అక్షరాలుండటం కూడా బ్యాగ్ సేల్స్‌ను పెంచింది. కొన్నేళ్ల పాటు ఆ బ్యాగును వాడిన తర్వాత.. ఆ నటి ఆ బ్యాగును హార్మీస్‌ సంస్థకు గుర్తుగా ఇచ్చేసింది. అయితే 1994లో ఆ సంస్థ దీన్ని వేలం వేసి, అలా వచ్చిన డబ్బును ఎయిడ్స్ ఛారిటీ కోసం విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత, ఆ బ్యాగ్‌ను పారిస్‌కు చెందిన కేథరీన్ బెనియర్ అనే మహిళ వేలంలో కొనుగోలు చేసింది. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ బ్యాగును సోథిబే సంస్థ వేలం నిర్వహించగా, ఓ జపాన్‌ వ్యక్తి దీనిని 85 కోట్లకు కొనేశాడు. అయితే, అతని వివరాలను సోథిబే అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ప్రపంచ చరిత్రలో అత్యధిక రేటు పలికిన 40 ఏళ్ల నాటి బ్యాగుగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 6 కోట్లు పెడితే..రూ.128 కోట్లు వచ్చాయి ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ

ఇంజెక్షన్ కోసం 20 కి.మీ నడిచిన 92 ఏళ్ల బామ్మ.. చివరకు

ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..

‘త్వరగా రిచ్‌ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్‌!

శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం