AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..

ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..

Phani CH
|

Updated on: Jul 20, 2025 | 7:09 PM

Share

నదులపై డ్యామ్‌ల నిర్మాణంతో అభివృద్ధి సాధ్యం అనేది మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వాలు వెనకాడవు. అలాంటిది చైనాలో మాత్రం రివర్స్‌ లో జరుగుతోంది. ఇప్పటి వరకు కట్టిన డ్యామ్‌లన్నీ కూల్చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఇప్పటి వరకు 300 డ్యామ్‌లు కూల్చేసింది.

అంతేకాదు 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి జల విద్యుత్‌ కేంద్రాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ బంద్‌ పెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డ్రాగన్‌ కంట్రీ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యామ్‌ల కూల్చివేత చర్యలు 2020 నుంచే మొదలు పెట్టినట్లు సమాచారం. ఆసియాలోనే అతి పొడవైన యాంగ్జీ నదిపై చైనా గత కొన్ని దశాబ్దాల కాలంలో భారీస్థాయిలో డ్యామ్‌లు, జల విద్యుత్‌ కేంద్రాలు నిర్మించింది. దీంతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లింది. నదిని ఆధారంగా చేసుకుని జీవించే జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుయ్‌ హే.. దీనినే రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఈ నదిలో అరుదైన చేపలు దొరుకుతుంటాయి. యునాన్, గుయిజౌ, సిచువాన్ నైరుతి ప్రావిన్సుల ద్వారా ఎర్ర నది 400 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. డ్యామ్‌లు, జలవిద్యుత్‌ కేంద్రాలు ఆ నదీ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నదీ పరివాహక ప్రాంతం ఎండిపోవడంతో అరుదైన చేపలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడంతో పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. యాంగ్జీ స్టర్జన్‌గా పేరుపొందిన స్టర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో ఆ చేపలు యాంగ్జీ పరివాహక ప్రాంతంలో విరివిగా లభించేవి. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతున్నట్లు గుర్తించారు. డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి చేపల మనుగడకు ఆటంకంగా మారినట్లు భావిస్తున్నారు. డ్యామ్‌ల కూల్చివేతతో రెడ్ రివర్ పునరుద్ధరణ జరిగి అరుదైన చేపల జాతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. 2023, 2024లో రెండు బ్యాచ్‌ల యాంగ్జీ స్టర్జన్‌లను నదిలోకి వదలి పరీక్షించారు. అవి విజయవంతంగా వాటి సంతతిని పెంపొందించుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘త్వరగా రిచ్‌ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్‌!

శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం

ప్రేమ పెళ్లికి శిక్షగా.. పొలం దున్నించారు..

యానాం వద్ద దొరికిన తొలి పులస.. ధర తెలిస్తే షాకే..

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

Published on: Jul 20, 2025 07:08 PM