ప్రేమ పెళ్లికి శిక్షగా.. పొలం దున్నించారు..
ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అనేది కామన్ అయిపోయింది. అయితే, నేటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో పెద్దలు ఈ విషయంలో రాజీపడటం లేదు. కొన్ని సార్లు తమ అభిప్రాయాన్ని గౌరవించలేదంటూ కులసంఘాల పెద్దలు ప్రేమ జంటలకు కఠినమైన శిక్షలూ అమలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒడిసాలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటను కాడెద్దులుగా మార్చి పొలం దున్నించారు అక్కడి గ్రామస్తులు.
ఒడిశా – రాయగడ జిల్లాలోని కంజమజ్జిరా గ్రామంలో ఓ యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని వారు చెప్పుకొచ్చారు. ఈ జంట చేసిన పని మూలంగా ఊరికి పట్టిన అరిష్టం తొలగిపోవాలంటే.. వారిద్దరినీ కాడెడ్లుగా మార్చి పొలం దున్నించాలని తీర్మానించారు. దీంతో ఊరి జనమంతా కలిసి వారిని కాడికి కట్టి వారి చేత పొలం దున్నించారు. నాగలి లాగ లేక ఆ జంట కష్టపడుతుంటే.. వారిని వెనకనుంచి కర్రలతో అదిలిస్తూ.. మొత్తానికి వారిచేత పొలం దున్నించారు. అనంతరం వారిని సమీపంలోని ఆలయానికి తీసుకుపోయి పాప పరిహారం నిమిత్తం కొన్ని పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యానాం వద్ద దొరికిన తొలి పులస.. ధర తెలిస్తే షాకే..
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

