AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

Phani CH
|

Updated on: Jul 20, 2025 | 5:31 PM

Share

జ‌పాన్‌లో ఇప్పుడు హై స్పీడ్‌ ఇంట‌ర్నెట్ సంచలనం సృష్టిస్తోంది. ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను ఆ దేశం రూపొందించింది. సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని తీసుకొచ్చింది. ఆ వేగంతో కేవ‌లం సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు. ప్రపంచంలోని ఫాస్టెస్ట్ ఇంట‌ర్నెట్‌ను జపాన్ తాజాగా రూపొందించింది.

ఒక సెక‌నుకు 1.02 పెటాబిట్స్ వేగంతో ప‌నిచేసే ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని క‌నుగొన్నారు. ఆ వేగంతో కేవ‌లం సెక‌నులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్ర‌రీలో ఉన్న వీడియోల‌ను డౌన్‌లోడ్ చేయ‌వచ్చు. భార‌త్‌తో పోలిస్తే జ‌పాన్‌లో బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ స్పీడ్ 16 మిలియ‌న్ల రెట్లు ఎక్కువ. ఇండియాలో స‌గ‌టు ఇంట‌ర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీపీఎస్‌. అమెరికాలోని ఇంట‌ర్నెట్ కంటే జపాన్ లో 3.5 మిలియన్ల రెట్లు అధిక వేగంతో నెట్ ప‌నిచేస్తుందని జపాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ NICT నివేదికలో స్సష్టం చేసింది. జ‌పాన్లో NICTతో కలిసి పని చేసిన ఫోటోనిక్ నెట్వ‌ర్క్ ల్యాబ్ టీమ్‌ ఇంకా సుమితోమా ఎల‌క్ట్రిక్‌, యురోపియ‌న్ పార్ట్న‌ర్స్ ఈ కొత్త త‌ర‌హా టెక్నాల‌జీని రూపొందించారు. ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన నెట్వ‌ర్క్‌ ఇదేనని భావిస్తున్నారు. సుమారు 1808 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ల‌క్ష్యానికి డేటాను కేవ‌లం సెక‌నులో పంపించవచ్చు. 19 కోర్స్ ఉన్న స్పెష‌ల్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది. కొత్త ఇంట‌ర్నెట్ స్పీడ్‌తో జ‌పాన్‌లో .. ఇంగ్లీష్ వికీపిడియాను 10వేల సార్లు కేవ‌లం ఒక్క సెక‌నులోనే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 8కే వీడియోల‌ను కేవ‌లం సెక‌నులో మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్ కోసం వాడే ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్‌ను సుమిటోమో ఎల‌క్ట్రిక్ సంస్థ డిజైన్ చేసింది. ఎన్ఐసీటీ దానికి కావలసిన ట్రాన్స్‌మిష‌న్ సిస్ట‌మ్‌ను తయారుచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాయత్తులు, రాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తి