ఎన్ని AIలు వచ్చినా మనిషి మేధస్సుకు ఢోకా లేదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులను భయపెడుతున్న అంశం. దీంతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు అన్నే ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊస్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామర్లను భర్తీ చేయలేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. ఇంకా 100 ఏళ్లు అయినా ఇది జరగని పని అని కుండబద్ధలు కొట్టేశారు. కోడింగ్‌కు ఎంతో క్రియేటివిటీ అవసరమని.. ఏఐతో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. డీబగ్గింగ్ వంటి విషయాలకు ఏఐ సహాయం చేయగలదని అన్నారు. కానీ ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాల్.. క్లిష్ట సమస్యను క్రియేటివిటీతో పరిష్కరించడం.. అది మెషిన్స్ చేయలేవని చెప్పారు. కోడ్ రాయడం అంటే కేవలం టైప్ చేయడం కాదు. ఎంతో లోతుగా ఆలోచించడం అని గేట్స్ అన్నారు. అభివృద్ధిలో టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా.. ప్రోగ్రామింగ్‌కు మాత్రం మనుషులే అవసరమని బిల్ గేట్స్ చెప్పారు. క్రియేటివిటీ, సిట్యువేషన్‌కు తగ్గట్లుగా మారడం వంటివి ఏఐ చేయలేదన్నారు. 2030 నాటికి AI దాదాపు 85 మిలియన్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తున్న సమయంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ ప్రమాదాల గురించి భయపడుతున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. అయితే తెలివిగా వాడుకుంటే.. ఏఐ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ప్రజలకు మరింత ఖాళీ టైమ్ మిగులుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నోడనుకునేరు.. మనోడు మహా రసికుడు..
గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!
సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

