సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు
రుతుపవనాల వల్ల వర్షాలు కురవటంతో అన్ని ప్రాంతాల్లో రైతులు పొలం బాట పడుతున్నారు. దుక్కులు దున్ని విత్తనాలు చల్లేందుకు రైతాంగం రెడీ అవుతోంది. అయితే, ఆర్థిక స్థోమత లేని కొందరు రైతన్నలు మాత్రం ఎప్పట్లాగే సాగు పనుల విషయంలో నానా తిప్పలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో పేదరికంలో మగ్గుతున్న ఓ రైతన్న తన భూమిని దున్నటం కోసం తన మనవళ్ళను కాడెద్దులుగా మార్చి దుక్కి దున్నాడు.
హృదయ విదారకమైన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పొలాన్ని ఎద్దులతో దున్నుతారు. కానీ కర్నూలు జిల్లా గోనెగొండ్ల కు చెందిన కౌలంట్లయ్య అనే రైతు, తన రెండెకరాలు పత్తి చేలో కలుపు తొలగించేందుకు.. సొంత మనవళ్ళనే కాదేద్దులుగా మార్చాడు. రెండేకరాలలో పత్తి పంట వేసిన ఈ రైతన్న.. తన పొలంలో గుంటక తోలించటానికి అడగగా, రెండు వేల రూపాయలు బాడుగ అడిగారు. అంత డబ్బు ఆ రైతు వద్ద లేకపోవటంతో సొంత మనవళ్లనే బతిమాలుకుని, వారిచేత గుంటక లాగించాడు. ఆ రైతు కష్టాన్ని చూసిన కర్నూలుకు చెందిన సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ చలించిపోయారు. ఆ రైతుకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. P4 ప్రోగ్రాం క్రింద రైతు కౌలుంట్లయ్యకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా చెక్ ను అందజేశారు. ఎద్దులు కొనుగోలు చేసి, సాగు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్
ఫేక్ రివ్యూ ఎఫెక్ట్ పోలీస్ స్టేషన్‌కు పూల చొక్కా…
రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

