AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!

గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!

Phani CH
|

Updated on: Jul 19, 2025 | 6:16 PM

Share

గుడ్లు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే. అందుకే గుడ్డును ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇవి కొంతమందికి విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును, మీరు విన్నది నిజమే.. గుడ్డు అందరికీ ఆరోగ్యకరం కాదట.. కొందరు గుడ్డు తింటే ఎక్కడలేని రోగాలు యాడ్‌ అవుతాయి అంటున్నారు. అవేంటో చూద్దామా...! నిజానికి గుడ్డు పోషకాల గని అని చెప్పవచ్చు. ఇందులో ఎ, డి, ఇ, కె, బి తదితర విటమిన్లు ఉంటాయి.

సమతుల ఆహారం తీసుకోవాలనుకునేవారు తప్పకుండా గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మంచి కొవ్వును గుడ్లు అందిస్తాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినమని సిఫార్సు చేస్తుంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ముందుగా కనిపించే వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి గుడ్లు తోడ్పడతాయి. గుడ్లు అందరికీ మేలు చేయవు. కొంతమందికి గుడ్డు తింటే మేలుకి బదులు హాని అధికంగా జరుగుతుంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీరు గుడ్డు సాధ్యమైనంత తక్కువగా తినడం మంచిదంటున్నారు నిపుణులు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. వీరు మితంగా తీసుకుంటే బెటర్ అంటున్నారు. అలాగే కాలేయం,మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి కూడా గుడ్డు అంత మంచిది కాదట. వీరు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఒంట్లో యూరియా, క్రియాటినిన్ పెరుగుతుందట. గుడ్డు తినడం వల్ల కొందరు పిల్లల్లో అలెర్జీ వస్తుందట. ఒక్కోసారి పెద్దలు కూడా దీని బారిన పడవచ్చట. గుడ్డులోని తెల్లసొనలోని ఓవల్‌బ్యూమిన్, ఓవోముకోయిడ్ మొదలైన ప్రోటీన్లు అలెర్జీకి కారణమవుతాయంటున్నారు. వీరు గుడ్డు ముట్టుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. దురద, దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు అనాఫిలాక్సిస్ ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు గుడ్డు పొరపాటున కూడా తినకూడదట. గుడ్లు సూపర్ ఫుడ్ అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇది విషంగా మారి హాని తలపెడుతుందంటున్నారు. దురద, దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు అనాఫిలాక్సిస్ ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు గుడ్డును పొరపాటున కూడా తీసుకోకూడదు. ఈ సమాచారం కేలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని ఫాలో అయ్యే ముందు మీ వైద్యుల సలహా తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు

పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్

ఫేక్ రివ్యూ ఎఫెక్ట్ పోలీస్‌ స్టేషన్‌కు పూల చొక్కా…

రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్

మనిషైనా..జంతువైనా.. ఆ విషయం లో భార్యకు వణకాల్సిందే

Follow Us