AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘త్వరగా రిచ్‌ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్‌!

‘త్వరగా రిచ్‌ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్‌!

Phani CH
|

Updated on: Jul 20, 2025 | 6:42 PM

Share

ప్రపంచంలో ధనవంతులుగా ఉండాలని కోరుకోని వారుండరు. అప్పుల బాధలతో కష్టాలు పడటం కంటే.. ధనవంతుడైపోతే జీవితం హాయిగా ఉంటుందనే అందరూ భావిస్తుంటారు. అయితే, ఈ విషయంపై చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం మాత్రం అద్భుతమనే చెప్పాలి. తక్కువ కాలంలో డబ్బు సంపాదనకు ఉన్న మార్గాలేంటని చాట్‌జీపీటీని అడిగినప్పుడు.. దానికి సమాధానం చెప్తూనే, చివర్లో అది ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ ఆలోచింప చేస్తోంది.

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్‌, వీడియో ఎడిటింగ్‌ వంటి స్కిల్స్‌ను నేర్చుకోవటంతో బాటు చాట్‌జీపీటీ, కాన్వా, మిడ్‌జర్నీ వంటి ఏఐ టూల్స్‌పై పట్టు సాధించడం ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించొచ్చని చాట్ జీపీటీ చెప్పింది. ఇవన్నీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలుగా ఉపయోగపడతాయని అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ ఫ్రీలాన్సింగ్‌, బ్లాగింగ్‌, అఫ్లియేట్‌ మార్కెటింగ్‌; యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ క్రియేషన్‌, డిజిటల్‌ ఉత్పత్తుల అమ్మకం వల్ల కూడా ఆదాయం వస్తుందని వివరించింది. సిప్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్‌, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా ధనవంతులు కావటానికి మార్గాలని, టెక్‌, ఫైనాన్స్‌పై యూట్యూబ్‌ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌ చేయడం ద్వారా కూడా ఆదాయం సంపాదించొచ్చని తెలిపింది. లింక్డిన్‌ వంటి నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండటం, నిపుణుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవటం, ఈవెంట్లు, సెమినార్లకు హాజరై, పాజిటివ్‌ మైండ్‌సెట్ కలిగిన వ్యక్తులతో పరిచయాలను పెంచుకోవటమూ జీవితంలో ఉపయోగపడుతుందని తెలిపింది. చివరగా.. ధనవంతులు కావటానికి కష్టపడటమే తప్ప షార్ట్‌కట్స్‌ లేవని.. ధనవంతులు కావటం కోసం లాటరీ, గ్యాంబ్లింగ్‌, అధిక రిటర్నులు ఇస్తాయని ప్రచారం చేసుకునే పథకాల జోలికి పోవద్దని చాట్‌జీపీటీ తెలిపింది. ఆశచూపే పథకాల జోలికెళ్లొద్దు. ఇలాంటివి మీ జీవితాన్ని మరింత రిస్క్‌లో పడేస్తాయంటూ చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఆలోచింపచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం

ప్రేమ పెళ్లికి శిక్షగా.. పొలం దున్నించారు..

యానాం వద్ద దొరికిన తొలి పులస.. ధర తెలిస్తే షాకే..

ఒక్క సెక‌నులో నెట్‌ఫ్లిక్స్ వీడియోలు మొత్తం డౌన్‌లోడ్

తాయత్తులు, రాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తి