ఇంజెక్షన్ కోసం 20 కి.మీ నడిచిన 92 ఏళ్ల బామ్మ.. చివరకు
ఒడిశాలో హృదయ విదారక ఘటన జరిగింది. శికబాహల్ గ్రామానికి చెందిన 92 ఏళ్ల మంగల్‌బారి మోహరాను కుక్క కరిచింది. దీంతో ఆమె సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి వెళ్లింది. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు అక్కడికి 10 కి.మీ దూరంలోని పెద్దాసుపత్రికి వెళ్లి రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలని సూచించారు. అక్కడి బస్టాండ్ వద్ద ఎంతో సేపు కూర్చుంది.
అయితే ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె చేస్తుండటంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆ దారిలో ఒక్క వాహనం కూడా రాలేదు. దీంతో , చేసేదేం లేక 10 కి.మీ నడిచి ఆసుపత్రికి వెళ్లి.. ఇంజక్షన్ వేయించుకుని, మరో 10 కి.మీ నడిచి ఇంటికి చేరింది 92 ఏళ్ల బామ్మ. చేతి కర్ర సాయంతో ఆ పెద్దావిడ 20 కిలోమీటర్లు నడవడంపై స్థానిక యంత్రాంగం స్పందించింది. ముందుగా తెలిసుంటే ఆమెకు అంబులెన్స్ ఏర్పాటు చేసే వారిమని తెలిపింది. నిజానికి 92 ఏళ్ల వయసులో ఆ బామ్మ రానుపోను 20 కిలోమీటర్లు నడవడమంటే మాటలు కాదు. ఆ వయసులో నాలుగు అడుగులు వేయడమే కష్టం. అలాంటిది ఒక ఇంజక్షన్ కోసం అంత దూరం నడవడం అందరి మనసులను కదిలించింది. ఇక నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున ఫైరవుతున్నారు. వయో వృద్ధులకు తగిన గౌరవం ఇచ్చి, అవసరమైన సదుపాయాలను కల్పించి.. వారి విషయాల్లో మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతున్నారు. ఒడిశాలో గతంలో జరిగిన కొన్ని ఘటనలను కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ బామ్మకు నెట్టింట మద్దతు లభిస్తోంది. ఇకనైనా సీనియర్ సిటిజన్స్ కు అవసరమైన సదుపాయాలను కల్పించాలి అని కోరుతున్నారు. ముఖ్యంగా వైద్యసదుపాయాలపై ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..
‘త్వరగా రిచ్ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్!
శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

